Cibil Score: ఈ చిన్న తప్పు చేసినా మీ సిబిల్ స్కోర్ పూర్తిగా పడిపోతుంది..!

Cibil Score Mistakes: సిబిల్ స్కోర్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితం పై ప్రభావం చూపుతుంది. అయితే మీరు చేసే కొన్ని తప్పుల వల్ల మీ సిబిల్ స్కోర్ పూర్తిగా పాడిపోయి అవకాశం ఉంది.

Update: 2025-04-22 11:05 GMT
Shocking Mistakes That Destroy Your CIBIL Score Without You Knowing

Cibil Score: ఈ చిన్న తప్పు చేసినా మీ సిబిల్ స్కోర్ పూర్తిగా పడిపోతుంది..!

  • whatsapp icon

Cibil Score Mistakes: సిబిల్ స్కోర్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితం పై ప్రభావం చూపుతుంది. అయితే మీరు చేసే కొన్ని తప్పుల వల్ల మీ సిబిల్ స్కోర్ పూర్తిగా పాడిపోయి అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో మీరు ఏ లోన్ పొందలేక కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొన్ని మీరు ఈ చిన్న తప్పులు చేయకుండా ఉంటే సిబిల్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం పడదు.. అవి ఏంటో తెలుసుకుందాం.

సిబిల్ స్కోర్ అనేది 3 డిజిట్స్ నంబర్ ఉంటుంది. ఇది 300 నుంచి 900 పాయింట్ల మధ్యలో ఉంటుంది. మీరు లోన్ కి అర్హత సాధిస్తారా? లేదా ? అనేది ఈ డిజిట్స్ తెలుపుతాయి. ఈ క్రెడిట్ స్కోర్ అనేది మీరు చెల్లింపు చేసే లోన్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ పై ఆధారపడి ఉంటుంది. సమయానికి బిల్లు చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోర్ ఎప్పుడు మెరుగ్గానే ఉంటుంది.

ఒకవేళ మీ ఈఎంఐ మిస్ అయినా మీ సిబిల్ స్కోర్ పూర్తిగా పడిపోతుంది. భవిష్యత్తులో మీరు ఎలాంటి రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మీకు ఏ బ్యాంకు రుణాలు కూడా అందించదు. ఎందుకంటే ఏ బ్యాంకులైనా మీరు ఇక చెల్లింపు చేయలేరేమో అనే భయంతో మీకు రుణాలు అందించవు.

మీకు ఒకవేళ ఒక పెద్ద లోన్ ఉంటే అది కూడా మీ సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే మీరు పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు.. ఇంకా చెల్లింపు చేయలేదు అని చూయిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది కూడా సిబిల్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. మీరు లోన్ కి అర్హత కాదు అని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో మీ సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది.

ఇది మాత్రమే కాదు మళ్ళీ మళ్ళీ లోన్స్ కి అప్లై చేయడం వల్ల కూడా సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది . కొంతమంది రెండు మూడు బ్యాంకుల్లో లోన్స్ కి అప్లై చేసి ఎక్కడ వడ్డీ తక్కువ వస్తే అక్కడ తీసుకుంటారు. ఇలా అప్లై చేసిన

కూడా సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంక్వయిరీ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఎందుకంటే దీని హార్డ్ ఎంక్వయిరీ అంటారు. మీరు ఆన్‌లైన్ లో మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే అది సాఫ్ట్ ఎంక్వైరీ అవుతుంది.

ఇక క్రెడిట్ కార్డు పై తరచుగా కొనుగోలు చేసిన కానీ పడిపోతుంది. మీ క్రెడిట్ కార్డు బిల్ కి 30% కి మించి ఏ వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఇది సిబిల్ పై ప్రభావం చూపుతుంది.

అంతేకాదు క్రెడిట్ కార్డు కి తరచూ అప్లై చేయడం వల్ల కూడా సిబిల్ పై ప్రభావం చూపుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ పై లోన్స్ కి రుణాలకు ఆ దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇది హార్డ్ ఎంక్వయిరీ అవుతుంది. కాబట్టి ఇది కూడా మీ సిబిల్ ని పడిపోయేలా చేస్తుంది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే

కొంతమంది క్రెడిట్ కార్డును క్లోజ్ చేసేస్తారు. ఇది కూడా సిబిల్ పై ప్రభావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలంటే సమయానికి ముందే చెల్లింపు చేయాలి.

Tags:    

Similar News