IRCTC: ఐఆర్‌సీటీసీలో తత్కాల్ టికెట్లు త్వరగా బుక్ చేసుకోవడం ఎలా తెలుసా?
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే చాలా కష్టతరం కేవలం 5 నిమిషాల్లోనే టికెట్లు అయిపోతాయి.

IRCTC: ఐఆర్‌సీటీసీలో తత్కాల్ టికెట్లు త్వరగా బుక్ చేసుకోవడం ఎలా తెలుసా?
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే చాలా కష్టతరం కేవలం 5 నిమిషాల్లోనే టికెట్లు అయిపోతాయి.
మనం ఎప్పుడైనా హఠాత్తుగా ప్రయాణం చేయాలంటే కచ్చితంగా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. రైలులో ప్రయాణం చేసే వారికి ఇది తప్పనిసరి లేదంటే రెండు నెలలుగా ముందు బుక్ చేసుకోవాలి. అయితే భారత దేశంలో రైల్వేలో నిత్యం లక్షలాదిమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. తక్కువ ధరలోనే దూర ప్రాంతాలకు తీసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువమంది రైలులోనే ప్రయాణం చేస్తారు. అయితే హఠాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోక తప్పదు.
అయితే ఐఆర్‌సీటీసీ ద్వారా తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కేవలం 5 నిమిషాల్లోనే టికెట్లు అన్నీ అయిపోతాయి. ప్రధానంగా స్లీపర్‌తో పాటు ఏసీ బోగీల్లో కూడా ఈ సదుపాయం ఉంది. అయితే ప్రధానంగా ఈ తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే త్వరగా బుక్ చేసుకోవాలి.
ఒకవేళ మీరు ఫోన్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. అయితే కచ్చితంగా 15 నిమిషాలకు ముందుగానే లాగిన్ అయ్యి ఉండాలి. ఉదయం 10:00 గంటల నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో మీరు పది నిమిషాలకు ముందుగానే లాగిన్ అయి ఉండాలి.
సాధారణంగా తత్కాల్ టికెట్లు ఒకరోజు ముందు ప్రయాణానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు స్లీపర్ తో పాటు ఏసీ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఏసీ తరగతిలో 10:00 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.
ఇక్కడ మీరు ప్రయాణించాల్సిన తేదీ సమయం నమోదు చేయండి. అక్కడ తత్కాల్ ఎంపిక చేసుకొని అందుబాటులో ఉన్న సీట్లను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు . రైలు కూడా ఎంపిక చేసుకున్న తర్వాత మీరు మీకు నచ్చిన తరగతిని ఎంపిక చేసుకోవచ్చు. బుక్ చేసిన తర్వాత మీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ప్రయాణికుల వివరాలను కూడా నమోదు చేసిన తర్వాత చివరగా చెల్లింపులు చేయాలి. యూపీఐ లేదా డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.
అయితే కేవలం 10 నిమిషాలకు ముందుగా మీరు లాగిన్ అయి ఉంటే వెంటనే తత్కాల్ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోతాయి. మరి ఎక్కువ సమయం పాటు కూడా లాగిన్ అయి ఉన్నా కానీ లాగిన్ ఎక్స్‌పైరీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ లాగిన్ అయినా కానీ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయి మీరు టికెట్లు బుక్ చేసుకోలేరు. సరిగ్గా 10 నిమిషాల ముందుగా లాగిన్ అయి ఉంటే సరిపోతుంది.