Gold Rate Today: పసిడిని పట్టుకోలేమా? ఆల్ టైం గరిష్టానికి పసిడి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2025-04-22 04:24 GMT
Gold Rate Today: పసిడిని పట్టుకోలేమా? ఆల్ టైం గరిష్టానికి పసిడి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
  • whatsapp icon

Gold Rate Today: బంగారం ధరలు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర అక్షరాల లక్ష రూపాయలకు చేరుకుంది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని చేరుకోవడం ఇదే తొలిసారి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీన పడటం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఈ క్రమంలో అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి సోమవారం 3405 డాలర్లకు చేరుకుంది. దీన్ని అనుసరించి దేశీయంగా లక్ష రూపాయల మార్కును అందుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00, 016చేరింది. ఆపై కాస్త దిగి వచ్చి రూ. 99, 900 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు బంగారం ధర రూ. 2వేల వరకు పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు రూ. 20వేలకు పైనే పెరిగింది. డిసెంబర్31న సుమారు రూ. 79వేలు ఉన్న బంగారం ధర గడిచిన మూడున్నర నెలల్లో 26శాతం పెరిగింది. అటు వెండి ధర కూడా కిలో మళ్లీ రూ లక్షకు చేరుకుంది. గతంలో ఓసారి లక్ష మార్కును దాటిన వెండి..ప్రస్తుతం రూ. 99, 299 పలుకుతోంది.

అటు మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలోనూ 10 గ్రాముల బంగారం మొదటిసారి రూ. 96 వేల మార్క్ దాటింది. జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్స్ 10 గ్రాముల బంగారం ఒక్కరోజులోనే రూ. 1621 మేర పెరిగి ఇంట్రాడేలో రూ. 96,875 దగ్గర గరిష్టాన్ని తాకింది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా-చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News