Gold Price: లక్ష దాటిన 10 గ్రాముల బంగారం ధర..మరి పాకిస్థాన్‌లో ఎంత ఉందో తెలుసా?
Gold Price: బంగారం ప్రియులకు ఇది నిజంగా మింగుడు పడని వార్తే. ఎంసీఎక్స్ లో జూన్ ఫ్యూచర్స్ కొత్త ఆల్-టైమ్ హైని తాకింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 99,178 రికార్డు స్థాయికి చేరుకుంది.

Gold Rate Today: ట్రంప్ ప్రకటనతో భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price: బంగారం ప్రియులకు ఇది నిజంగా మింగుడు పడని వార్తే. ఎంసీఎక్స్ లో జూన్ ఫ్యూచర్స్ కొత్త ఆల్-టైమ్ హైని తాకింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 99,178 రికార్డు స్థాయికి చేరుకుంది. నిన్నటితో పోలిస్తే ఇది దాదాపు రూ. 1,900 పెరుగుదల. ఇక రిటైల్ మార్కెట్‌లో అయితే బంగారం ఏకంగా 10 గ్రాములకి రూ. 1 లక్ష మార్క్‌ను దాటేసింది. బంగారం కొనాలనుకునే వారికి ఇది మరింత భారంగా మారిపోయింది. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే, మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
పాకిస్థాన్‌లో బంగారం ధర ఎంత?
పాకిస్థాన్ టుడే నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 22న పాకిస్థాన్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 324,940 పాకిస్థాన్ రూపాయలు. దీన్ని భారతీయ కరెన్సీలోకి మారిస్తే ఇది దాదాపు రూ. 98,509.64కు సమానం. అంటే, మనకంటే కొంచెం తక్కువ ధరకే అక్కడ బంగారం లభిస్తోంది.
పాకిస్థాన్‌లో బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
బీబీసీ ఉర్దూ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లో బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడమేనని అక్కడి వ్యాపారులు భావిస్తున్నారు. ఆల్ పాకిస్థాన్ సర్రాఫా జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కరాచీ బులియన్ ఎక్స్ఛేంజ్ ఛైర్మన్ ముహమ్మద్ కాసిమ్ షికర్‌పురి మాట్లాడుతూ.. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం, కొత్త టారిఫ్‌ల అమలు కారణంగా ఈ పెరుగుదల వచ్చిందని తెలిపారు.
భారత్‌లో బంగారం ఎందుకు ఇంత ఖరీదైనది?
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. భారతదేశంలో బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అమెరికాలో అధ్యక్షుడు, ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ మధ్య వడ్డీ రేట్లపై ఉన్న విభేదాలు. దీని ప్రభావం నేరుగా డాలర్ ఇండెక్స్‌పై పడింది. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 98.12 వద్ద ట్రేడవుతోంది, ఇది గత మూడేళ్లలో అత్యల్ప స్థాయి. డాలర్ బలహీనంగా ఉండటంతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి ఎంపికల వైపు చూస్తున్నారు. బంగారం ఎల్లప్పుడూ ‘సురక్షితమైన స్వర్గధామం’గా పరిగణించబడుతుంది. దీనితో పాటు అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు కూడా బంగారం డిమాండ్‌ను మరింత పెంచాయి.