AC: అద్దె ఇంట్లో ఉండే వారికి బెస్ట్‌... ఈ పోర్టబుల్ ఏసీ. ఎలాంటి టెన్షన్ ఉండదు

AC: వేసవి వచ్చేసింది. భానుడి భయంకరమైన తాపం జనాలను గడగడలాడిస్తోంది. ఉక్కపోతతో తల దించుకోలేని పరిస్థితి. ఎవరెవరి తలప్రాణాలు వారు కాపాడుకోవడానికి ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలకు ఆశ్రయం తీసుకుంటున్నారు.

Update: 2025-04-23 05:47 GMT
AC

AC: అద్దె ఇంట్లో ఉండే వారికి బెస్ట్‌... ఈ పోర్టబుల్ ఏసీ. ఎలాంటి టెన్షన్ ఉండదు

  • whatsapp icon

AC: వేసవి వచ్చేసింది. భానుడి భయంకరమైన తాపం జనాలను గడగడలాడిస్తోంది. ఉక్కపోతతో తల దించుకోలేని పరిస్థితి. ఎవరెవరి తలప్రాణాలు వారు కాపాడుకోవడానికి ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలకు ఆశ్రయం తీసుకుంటున్నారు. ఈ వేడి మరింత పెరిగే సూచనలతో ఇప్పటికే చాలామంది ముందస్తుగా ఏసీ కొనుగోలుకు రెడీ అవుతున్నారు.

అయితే సొంతిల్లు ఉన్న వారు ఎంచ‌క్కా ఏసీ ఫిట్ చేసుకుంటారు. కానీ రెంట్‌కు ఉండేవారే ఈ విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కొంత‌మంది ఇంటి య‌జ‌మానులు ఏసీలు బిగించ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌రు. అలాగే ఇల్లు మారాల్సి వ‌స్తే ప్ర‌తీసారి ఏసీని తీసుకెళ్ల‌డం ఇబ్బందితో కూడుకున్న విష‌యం. అయితే ఇలాంటి వారి కోస‌మే మార్కెట్లోకి పోర్ట‌బుల్ ఏసీలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇంత‌కీ ఏంటీ పోర్ట‌బుల్ ఏసీ.? వీటితో ఎలాంటి లాబాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పోర్టబుల్ ఏసీ అనేది చిన్న, మొబైల్ ఏసీ. దీన్ని మీరు మీ గదిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. దీన్ని అమర్చడానికి గోడలకు రంధ్రాలు చేయాల్సి ప‌నిలేదు. కేవలం కిటికీకి ఒక ఎగ్జాస్ట్ పైపు అమర్చితే చాలు. ఇది గదిలోని వేడి గాలిని బయటకు పంపుతుంది. గోడలు చెడిపోకుండా కిటికీకి ఎగ్జాస్ట్ పైప్ అమర్చడం ద్వారా చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. వీటికి చక్రాలు, హ్యాండిల్స్ ఉంటాయి కాబట్టి రూమ్ మార్చినా, అంతే సులభంగా మరో గదిలోకి తేవచ్చు.

చాలావరకు ఈ ఏసీలు స్వయంగా డీహ్యూమిడిఫై చేస్తాయి. టైమర్, రిమోట్ కంట్రోల్, మల్టిపుల్ మోడ్‌లు వంటి ఫీచర్లతో వస్తాయి. ఈ ఏసీ ఏర్పాటు చేయ‌డానికి ఒక పవర్ సాకెట్, ఎగ్టాస్ట్ పైపు అమ‌ర్చేందుకు ఒక కిటికీ ఉంటే స‌రిపోతుంది. అద్దె ఇంట్లో నివసిస్తూ వేసవి వేడి నుంచి ఉపశమనం కోరుకునే వారు పోర్టబుల్ ఏసీ అనేది నిజంగా అద్భుతమైన ప్రత్యామ్నాయం. తక్కువ ఇన్‌స్టాలేషన్ ఇబ్బందులతో, తరచూ షిఫ్ట్ అయ్యే వారికి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్. మ‌రెందుకు ఆల‌స్యం ఈ పోర్ట‌బుల్ ఏసీని కొనుగోలు చేయండి, స‌మ్మ‌ర్ హీట్‌ను త‌రిమికొట్టండి.

Tags:    

Similar News