Rupay Credit Card: యూపీఐ చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలి తెలుసా?
UPI Payments With Rupay Card: ఇప్పటివరకు మన వద్ద ఉన్న ఏటీఎం కార్డు ద్వారా అంటే డెబిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేశాం. అయితే క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లి చేయడం తెలుసా?

Rupay Credit Card: యూపీఐ చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలి తెలుసా?
UPI Payments With Rupay Card: ఇప్పటివరకు మన వద్ద ఉన్న ఏటీఎం కార్డు ద్వారా అంటే డెబిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేశాం. అయితే క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లి చేయడం తెలుసా?
సాధారణంగా యూపీఐ చెల్లింపులు డెబిట్ కార్డు ఆధారంగా లింక్ చేసి చేస్తారు. అయితే ఎప్పుడైనా మీకు రూపే క్రెడిట్ కార్డుతో కూడా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేయవచ్చని మీకు తెలుసా? అవును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI)రూపేతో కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చని తెలిపింది.
ప్రస్తుతం మీరు డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేసినట్లే రూపే క్రెడిట్ కార్డు తో కూడా చెల్లింపులు చేయొచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, పంజాబ్ నేషనల్, యూనియన్ బ్యాంక్ రూపే బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ప్రత్యేకంగా రూపొందించారు. అయితే వీసా, మాస్టర్ కార్డు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి ఉపయోగించలేరు. కేవలం రూపే క్రెడిట్ కార్డు ద్వారానే ఈ చెల్లింపులు చేయవచ్చు.
రూపే క్రెడిట్ కార్డుకు లింక్ చేయాలంటే యూపిఐ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. అక్కడ మీరు ఎప్పటిలాగే బ్యాంక్ ఖాతాను యాడ్ చేసుకోవాలి. మీ బ్యాంక్ ఖాతాను ఎంపిక చేసుకుంటే ధృవీకరణ చేయడానికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. తద్వారా మీరు క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేయడం ప్రారంభించవచ్చు.
అయితే మీరు మామూలుగా ఉపయోగించినట్టే యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ సహాయంతో క్రెడిట్ కార్డు ఉపయోగించవచ్చు. అంతేకాదు మీకు క్రెడిట్ కార్డు పరిమితిలోపు మాత్రమే చెల్లింపులు చేయగలరు. కేవలం బిజినెస్‌కు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ వ్యక్తికి డబ్బు చెల్లించడానికి ఇది వర్తించదు.
ఈ రూపే కార్డు ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా మీరు రివార్డ్ పాయింట్లు కూడా పొందుతారు. కానీ సకాలంలో బిల్లులు చెల్లించి రెగ్యులర్ గా వడ్డీ లేకుండా వ్యవధి కూడా లభిస్తుంది. అయితే రూపే డెబిట్ కార్డును మాత్రం యూపీఐ చెల్లింపులకు లింక్ చేయలేరు. కానీ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మీరు క్రెడిట్ కార్డును మాత్రం ఉపయోగించండి. ఆలస్ చెల్లింపులకు తగిన రుసుము విధించబడుతుంది.