VI: ఎక్కువ మంది రీఛార్జ్‌ చేసుకుంటున్న ఈ వీఐ ప్లాన్‌ ఎందుకంత ప్రత్యేకం తెలుసా?

VI Recharge Plan: గత ఏడాది జూలై తర్వాత టెలికాం కంపెనీలు అన్నీ రీఛార్జీ ధరలను పెంచేశాయి. కానీ, వీఐ సంబంధించిన ఈ ప్యాక్‌ ఇంకా ట్రెండింగ్‌లో నిలిచింది ఎందుకో తెలుసా?

Update: 2025-04-15 12:04 GMT
VI 1749 Recharge Plan

VI: ఎక్కువ మంది రీఛార్జ్‌ చేసుకుంటున్న ఈ వీఐ ప్లాన్‌ ఎందుకంత ప్రత్యేకం తెలుసా?

  • whatsapp icon

VI Recharge Plan: వీఐ రూ.1749 అందిస్తున్న ఈ ప్లాన్‌ ఎక్కువమంది రీఛార్జీ చేసుకుంటున్నారు. ఇదే ప్యాక్‌ ఇతర టెలికాం కంపెనీలు మాత్రం ఎక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీఐ అందిస్తోన్న ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 180 రోజులు వర్తిస్తుంది. అయితే, జియో ఎయిర్‌టెల్‌ ఈ ధరలో 84 రోజులు వ్యాలిడిటీ అందిస్తున్నాయి.

రూ.1749 ప్లాన్‌..

వీఐ అందిస్తోన్న ఈ వీఐ ప్లాన్‌ ధర రూ.1749 మాత్రమే. ఇందులో 1.5 జీబీ డేటా ప్రతిరోజూ పొందుతారు. దీంతోపాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఏ నెట్‌వర్క్‌ అయినా చేసుకోవచ్చు అంతేకాదు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. ఇది మాత్రమే కాదు వీఐ వీటితోపాటు అదనంగా బింజే ఆల్‌ నైట్‌ బెనిఫిట్స్‌ కూడా అందిస్తోంది. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వర్తిస్తుంది. అంతేకాదు 2 జీబీ బ్యాకప్‌ డేటా కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్‌ రూ.1798 ప్లాన్‌..

ఎయిర్‌టెల్‌ అందిస్తోన్న ఈ ప్లాన్‌ 84 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. ఇందులో కూడా ప్రతిరోజూ 3 జీబీ డేటా 5 జీ నెట్‌వర్క్‌ స్పీడ్‌లో పొందుతారు. ఇందులో కూడా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ఉచితంగా 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఇది మాత్రమే కాదు వింక్‌ మ్యూజిక్‌ ఉచిత యాక్సెస్‌ కూడా పొందుతారు.

జియో రూ.1799 ప్లాన్‌..

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కూడా 84 రోజులు వర్తిస్తుంది. 3 జీబీ డేటాతోపాటు 5 జీ స్పీడ్‌ నెట్‌ పొందుతారు. ఈ జియో రీఛార్జీ ప్లాన్‌లో కూడా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు.ఈ ప్యాక్‌లో అదనంగా జియో సినిమా, జియో టీవీ, నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ రీఛార్జీ ప్యాక్‌ యాక్సెస్‌ కూడా పొందుతారు.

Tags:    

Similar News