PM Kisan: ఈ 3 పనులు ఇప్పుడే పూర్తి చేయండి.. లేదంటే పీఎం కిసాన్ 20వ విడుత డబ్బులు పొందలేరు..!
PM Kisan 20th Installment: ఈ మూడు పనులు ఇప్పుడే పూర్తి చేయండి. లేకపోతే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు రావు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKYC) ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

PM Kisan: ఈ 3 పనులు ఇప్పుడే పూర్తి చేయండి.. లేదంటే పీఎం కిసాన్ 20వ విడుత డబ్బులు పొందలేరు..!
PM Kisan 20th Installment: ఈ మూడు పనులు ఇప్పుడే పూర్తి చేయండి. లేకపోతే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు రావు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKYC) ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే 20వ నిధులు మంజూరు కావాలంటే ఈ పని ఇప్పుడే పూర్తి చేయండి.
పీఎం కిసాన్ యోజన ద్వారా ప్రతి ఏడాది రూ.6000 చొప్పున ప్రతి రైతు పొందుతున్నారు. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాలో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే కొన్ని పనులు పూర్తి చేస్తే మీరు 20వ విడత నిధులు కూడా పొందుతారు. ప్రధానమంత్రి యోజన ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు 19 విడుదల నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 20వ నిధులను జూన్ నెలలో మంజూరు చేసే అవకాశం ఉంది .
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులు లబ్ధి పొందాలంటే ముందుగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇది పూర్తి చేయకపోతే డబ్బులు పడవు. ఇంట్లోనే కూర్చొని అధికారిక వెబ్‌సైట్లో త్వరగా పూర్తి చేసుకోవచ్చు. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ (CSC)వద్ద కూడా అందుబాటులో ఉంటుంది. pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్ లేదా కిసాన్ యాప్ ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.
ఇక రెండో పని మీరు పీఎం కిసాన్ నిధులు పొందాలంటే మీ భూమి రికార్డులు వెరిఫికేషన్ చేసుకొని ఉండాలి. లేకపోతే ఈ నిధులు పడవు. మీ భూమి వెరిఫై అవుతేనే అది కూడా సరిగ్గా పేరుపై ఉన్న వ్యక్తికి మాత్రమే నిధులు పడతాయి. ఇక మూడవ పని మీ బ్యాంకు ఖాతాను, ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి. లేకపోతే నిధులు పొందలేరు ఈ పనులు వెంటనే ఆన్‌లైన్ లో సులభంగా చేయవచ్చు.