Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్..తులంపై ఎంత తగ్గిందంటే?

Update: 2025-04-27 05:31 GMT
Gold Rate Today:  మళ్లీ తగ్గిన బంగారం ధర.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్..తులంపై ఎంత తగ్గిందంటే?
  • whatsapp icon

Gold Rate Today: బంగారం కొనుగోలు చేసేవారికి ఇదే మంచి అవకాశం. చైనా దిగుమతులపై టారిఫ్స్ పై వెనక్కి తగ్గుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చిన క్రమంలో బంగారం ధరలు వరుసగా దిగివస్తున్నాయి. నాలుగు రోజుల్లో రూ.4 వేల వరకు తగ్గాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు తగ్గుతున్నాయి. బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే బంగారం ధరలు వరుసగా దిగివస్తున్నాయి. చైనా వస్తువులపై టారిఫ్స్ అమలు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గుతున్నట్లు సంకేతాలు ఇచ్చిన క్రమంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. మల్టీ కమెడిటీ ఎక్స్చేంజీలో బంగారం ధరలు పతనం అవుతున్నాయి. నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 4 వేల మేర బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా టారిఫ్ యుద్ధంపై ఆందోళనలు తగ్గుతున్న క్రమంలో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు అందుకునేందుకు మదుపరులు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో బంగారం ధరలు దిగివస్తున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర ఎంత దిగివచ్చిందో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా దిగివస్తున్నాయి. క్రితం రోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 90, 050 వద్ద ఉంది. నేడు మరో రూ. 30 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధరరూ. 90, 020కు దిగి వచ్చింది. అలాగే 24క్యారెట్ల మేలిమి బంగారం ధర తులంపై రూ. 30 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 98, 210కి తగ్గింది. బంగారం ధరలు దిగివచ్చినా వెండి మాత్రం షాక్ ఇస్తోంది. క్రితం రోజుతో పోల్చితే నేడు కిలో వెండి ధర రూ. 1000 మేర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 1,11,900 వరకు ఎగబాకింది. 

Tags:    

Similar News