Pahalgam terrorist attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి..ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

Pahalgam terrorist attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో గాయపడిన పౌరులకు ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్సను ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వంతో పాటు నిలబడతానని ప్రతిజ్ఞ చేశాడు. కుట్రదారులకు కఠిన శిక్ష విధిస్తామని, ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరాటం చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ముకేశ్ అంబానీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన రిలయన్స్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉగ్రదాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఉగ్రదాడిలో గాయపడిన వారికి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన సర్ హెచ్ఎన్ హాస్పిటల్ లో ఉచితంగా చికిత్స అందిస్తామని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదం మానవాళికే మచ్చ అని అది ఏ రూపంలో ఉన్నా సహించరాదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కునే విషయంలో మోదీ, భారత ప్రభుత్వానికి రిలయన్స్ అండగా నిలుస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ముఖేశ్ అంబానీ.