Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగివస్తున్న బంగారం ధరలు ..తులం ఎంతుందుంటే?

Gold Rate Today
Gold Rate Today: పసిడి ప్రియులకు ముఖ్యగమనిక. బంగారం ధరలు వరుసగా భారీగా దిగివస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో అమెరికా, చైనా వాణి్య యుద్ధ భయాలు, డాలర్ పతనం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం ఇలా పలు రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే గోల్డ్ ధరలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. అయితే రెండు రోజుల కింద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రీతిలో ప్రకటించారు. చైనాపై సుంకాలను గణనీయంగా తగ్గించున్నట్లుగా వెల్లడించారు. జీరోకు మాత్రం రావని..ఆ దేశంతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నట్లు వెల్లడించారు.
ఈ విధంగా ట్రంప్ ప్రకటన నేపథ్యంలో మరుసటి రోజు బులియన్ మార్కెట్లో ప్రభావం కనిపించింది. కిందటి రోజు దేశీయంగా బంగారం ధర భారీగా తగ్గింది. 24క్యారెట్ల బంగార ధర ఒక్కరోజులోనే తులానికి రూ. 3వేలు పడిపోయింది. నేడు కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర ఒక్కరోజు రూ. 100 తగ్గింది. ప్రస్తుతం తులానికి రూ. 90, 050కి దిగివచ్చింది. ఇదే 24క్యారెట్ల ధర విషయానికి వస్తే రూ. 110 తగ్గడంతో పది గ్రాములకు ఇప్పుడు రూ. 98, 240కి పడిపోయింది. హైదరాబాద్ లో వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో ఒక్కరోజు రూ. 1000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 1.09 లక్షలకు పడిపోయింది.