Car Loan: కారు లోన్‌ కావాలా? రూ.7 లక్షలపై అతి తక్కువ వడ్డీకే రుణం పొందే ఛాన్స్‌

Car Loan Lowest Interest: లక్షలు పెట్టి కార్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వారికి పెద్ద భారంగానే ఉంటుంది. అయితే అందుకే బ్యాంకుల్లో రుణాలకు దరఖాస్తు చేసుకుంటారు.

Update: 2025-04-24 15:45 GMT
Car Loan: కారు లోన్‌ కావాలా? రూ.7 లక్షలపై అతి తక్కువ వడ్డీకే రుణం పొందే ఛాన్స్‌
  • whatsapp icon

Car Loan Lowest Interest: లక్షలు పెట్టి కార్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వారికి పెద్ద భారంగానే ఉంటుంది. అయితే అందుకే బ్యాంకుల్లో రుణాలకు దరఖాస్తు చేసుకుంటారు.

మీరు కూడా కార్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా? అతి తక్కువ ధరకే రూ.7,00,000 వరకు రుణాన్ని ఎలా పొందాలో తెలుసా? మధ్యతరగతి వారికి ప్రతి ఒక్కరికి కారు కొనాలని కోరిక ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా పోగుచేసిన డబ్బులతో కారు కొనుగోలు చేస్తారు. మరి కొంత మంది బ్యాంకులో రుణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లక్షల్లో ఈ కారు ధరలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరకే ఈఎంఐ తో మీరు రూ.7 లక్షల వరకు రుణాన్ని ఎస్‌బీఐ బ్యాంకులో పొందవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం ..

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కారు లోని 9.10% వడ్డీ నుంచి అందిస్తోంది. దీనికి సిబిల్ స్కోర్ తో పాటు ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి.

కారు రుణం మీరు ఏడు లక్షలు పొందితే దానిపై ఈఎంఐ ఎంత చెల్లించాల్సి వస్తుంది. దీనికి 5 ఏళ్ల పాటు వ్యవధి ఇస్తారు. 9.10% వడ్డీతో ఈఎంఐ రూ.14,565 అవుతుంది. 5 ఏళ్ల పాటు ఈ డబ్బు చెల్లించాలి. దీనికి రూ.8,73,891 బ్యాంకు చెల్లించాలి. అంటే వడ్డీ రూపంలో రూ. 1,73,891 చెల్లిస్తున్నారు.

ఈ కార్ లోన్ కు అప్లై చేయాలంటే మీ వయసు 21 నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంతేకాదు మీరు సరైన ఆదాయం పొందుతూ ఉండాలి. మీ సిబిల్ స్కోర్ కూడా పాజిటివ్ గా ఉండేలా చూసుకోండి. ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మీ ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్‌తోపాటు కార్ కొటేషన్ కూడా ఉండాలి. ఇంక మీరు ఎస్‌బీఐ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఏదైనా బ్రాంచ్ కి వెళ్లి మీరు ఆన్‌లైన్లో అప్లై చేసుకునే సదుపాయం ఉంది. లోన్ అప్రూవ్ చేసిన వెంటనే కార్ డీలర్‌కి డబ్బులు వెళతాయి.

అది తక్కువ వడ్డీతో ఈఎంఐ చెల్లించవచ్చు. ఏడేళ్ల పాటు చెల్లింపు సదుపాయం ఉంది. ఆన్ రోడ్డు ధర కార్లకు కూడా ఈ లోన్ అందుబాటులో ఉంటుంది.ఎంయూవీ, ఎస్‌యూవీలకు కూడా లోన్ పొందవచ్చు. దీనికి ఎలాంటి ప్రీ పేమెంట్ ఛార్జీలు ఉండవు. ఫోర్ క్లోజర్ ఛార్జీలు రెండేళ్ల తర్వాత వర్తిస్తాయి.

Tags:    

Similar News