Money Saving Tips: మీ జీతం డబ్బులు నెల తిరిగేసరికి మిగలడం లేదా? ఈ 30 రోజుల అలవాటుతో డబ్బే డబ్బు!

Money Saving 30 Days Habit: చాలామందికి ఈ కాలంలో జీతం వస్తుంది కానీ, అది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. దీనికి ప్రధానంగా మనకు ఉండే కొన్ని అలవాట్లు దీనికి కారణం.

Update: 2025-04-24 09:15 GMT
Money Saving Tips: మీ జీతం డబ్బులు నెల తిరిగేసరికి మిగలడం లేదా? ఈ 30 రోజుల అలవాటుతో డబ్బే డబ్బు!
  • whatsapp icon

Money Saving 30 Days Habit: చాలామందికి ఈ కాలంలో జీతం వస్తుంది కానీ, అది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. దీనికి ప్రధానంగా మనకు ఉండే కొన్ని అలవాట్లు దీనికి కారణం. జీతం డబ్బులు ఎప్పుడు వస్తాయో అని నేలంతా ఎదురు చూస్తాం. అది తీరా ఇలా వచ్చి పోతుంది. అయితే ముఖ్యంగా ప్రతి నెల జీతం సంపాదించే ఉద్యోగులకు పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. ఒక పైసా కూడా మిగలని దుస్థితి ఏర్పడుతుంది. మీరు కూడా ఇదే సిచువేషన్ లో ఉన్నారా ?అయితే ఈ కొన్ని టిప్స్ పాటిస్తే మీకు డబ్బు మిగులుతుంది.

ఈ 30 రోజులు అలవాటు క్రమం తప్పకుండా చేయాలి. ఇది మీ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తుంది తద్వారా మీరు కోరుకున్న డబ్బు ఎప్పుడూ మీ జేబులో ఉంటుంది.

ప్రధానంగా మీకు ఎక్కువగా ఇంట్లో ఏది ఖర్చు అవుతుంది. దాని అంచన వేసుకోవాలి. 30 రోజులకు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు. మీకు తెలియకుండా అనవసర ఖర్చులు ఏం పెడుతున్నారు తెలుసుకోవాలి ప్రతిరోజు మీరు తినే స్నాక్ కావచ్చు లేకపోతే ఓటిటి సబ్స్క్రిప్షన్ అయి ఉండవచ్చు. ఇది మీ డబ్బులను హరించేస్తుంది . ఇది కూడా నెలపాటు లెక్కబెడితే ఎక్కువ డబ్బు అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులను కూడా జాగ్రత్త లెక్క వేసుకోవాలి . అనవసరంగా ఉంటే వాటిని తొలగించుకోండి .

మీరు నెలవారీ లెక్కలు వేసేటప్పుడు అవి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతుంది తెలుసుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. స్నాక్‌ నుంచి కొన్నిసార్లు లేట్ ఫీజు చెల్లించినా కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. అక్కడ మీరు డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌లోనే బిల్స్ రిమైండర్ ఏర్పాటు చేసుకోవచ్చు. బయట నుంచి ఫుడ్ తీసుకోకుండా ఇంట్లోనే వండుకోవాలి. ఇది కూడా డబ్బులను ఆదా చేస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు ఈ 30 రోజులు అలవాటు చేసుకుంటే మీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.

కొంతమంది అనవసర ఖర్చులు ఎక్కువగా పెడతారు. ఇది కూడా మీ ఎమర్జెన్సీ ఫండ్ ను హరించేస్తుంది. బదులుగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టండి. దీంతో మీకు మంచి రాబడి కూడా వస్తుంది. ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఎప్పటికప్పుడు మీకు ఖర్చులను లెక్క వేసుకుంటూ ఉండే అలవాటు కూడా ఎంతో మంచిది. తద్వారా అధికంగా ఖర్చులు చేయకుండా ఉంటారు. మీరు ఎంత సంపాదిస్తుంది కాదు.. ఎంత ఆదా చేస్తున్నారనేది ప్రధానం. ఏదైనా షాపింగ్ మాల్స్ కి వెళ్తే మీకు కావాల్సింది రాసుకుని వెళ్లి మరీ అవి మాత్రమే కొనుక్కోండి. అనవసరంగా ఏ వస్తువులు కొనుగోలు చేయకూడదు.

Tags:    

Similar News