Central Govt Scheme: రైతులకు అదిరే శుభవార్త.. మంచి పథకం తీసుకువచ్చిన మోదీ సర్కార్..!
Central Govt farmers Scheme: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఎన్నో పథకాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త పథకాన్ని కూడా అందిస్తోంది.

Central Govt Farmers Scheme: రైతులు మన దేశానికి వెన్నుముఖ. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ ఇప్పటికే ఎన్నో అద్బుతమైన పథకాలను రైతుల కోసం ప్రారంభించింది. అయితే, తాజాగా మరో పథకం కూడా కేంద్ర తీసుకువచ్చింది. దాదాపు 90 శాతం పథకంతో ఈ కొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. రైతుల సమస్యల పరిష్కరణ, నీటిపారుదలకు సంబంధించిన ప్రధాన మంత్రి సించాయ్ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ బడ్జెట్‌లో కేంద్రం ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి దాదాపు రూ.1600 కోట్లు కూడా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడానికి ప్రధాన కారణం చిన్న సన్నకారు రైతులు నీటి సరఫరాలో లాంటి ఇబ్బందులు పడకుండా సాంప్రదాయ నీటి వ్యవస్థలను ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధించడానికి ఈ పథకం ప్రారంభించారు. దేశంలో నీటి ఎద్దడి ఏర్పడుతున్న ఈ తరుణంలో ఇలా సాంప్రదాయ నీటి వ్యవస్థను ఆధునికీకరిచడం ఎంతో ఆవశ్యకం.
తద్వారా రైతుల నీటి సమస్యలు తగ్గిపోతాయి. మరుగున పడిన నీటి కాలువలను కొత్త సంకేతికతతో అనుసంధించడం వంటివి చేయనున్నారు. పంట ఉత్పత్తి పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ పథకం అమలుకు స్థానికంగా కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వారే ఈ పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల యువ రైతులను కూడా ఆకట్టుకుంటుంది. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.