Gold Rate Today: అక్షయ తృతీయ ముందు మహిళలకు గుడ్ న్యూస్..పసిడి పరుగులకు బ్రేక్

Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. మరోసారి లక్షల దాటిన తులం పసిడి
Gold Rate Today: అక్షయ తృతీయ పండగకు ముందే మహిళలకు శుభవార్త వినిపించింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వీటి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి..ఎంత తగ్గాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత క్రమంగా మళ్లీ తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో రూ. 98, 200 స్థాయిలో ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,010గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర రూ. 98, 300 స్థాయిలో ఉంది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90, 160గా ఉంది.
మరోవైపు ఈ రోజు కిలో వెండి ధర కిలోకు 100 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో రూ. 111,800గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 101,800 ఉంది. చెన్నైలో 111,800, పూణేలో రూ. 101, 800, బెంగళూరులో రూ. 101, 800గా ఉంది. మార్కెట్లు మొదలైన తర్వాత వీటి ధరలు మళ్లీ మారే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఇప్పటికే లక్ష రూపాయలకు చేరుకున్న బంగారం ధరలు అక్షయ త్రుతీయ పండగ రోజు ఇంకా పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.