Travel Insurance: ట్రావెల్ ఇన్సురెన్స్ అంటే ఏంటి..? దీని వల్ల కలిగే లాభాలు ఇవే..?

Travel Insurance: ప్రస్తుత కాలంలో ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏ క్షణాన ఎలాంటి సంఘటన జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి విషయానికి ఇన్సూరెన్స్ అనేది ఒక రక్షణాత్మకమైన చర్యగా మారిపోయింది. ప్రస్తుతం ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం దేశ విదేశాల్లో ట్రావెల్ చేసే సమయంలో మెడికల్ ఖర్చులు, ట్రిప్ క్యాన్సిలేషన్, లగేజ్ లాస్, ఫ్లైట్ రద్దు, పర్సనల్ యాక్సిడెంట్స్ వంటి ప్రమాదాలు జరిగినప్పుడు మీకు కలిగే నష్టాల నుంచి ఇది రక్షణ కల్పించే బీమా సౌకర్యం. ట్రావెల్ ఇన్సూరెన్స్ వల్ల మీరు అనుకోని పరిస్థితుల వల్ల నష్టపోయినట్లైతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండటం వల్ల మీరు డబ్బు పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటే లగేజ్ పోయినప్పటికీ నిర్ణీత మొత్తంలో మీకు బీమా కవరేజ్ ఉండటం వల్ల డబ్బులు తిరిగి వస్తాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు అనుకోని ప్రమాదంలో మరణించినట్లయితే కుటుంబ సభ్యులకు కవరేజీలో భాగంగా బీమా డబ్బులు వస్తాయి.
ట్రావెల్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలు ఇవే..
>> కొన్ని సందర్భాలలో ఫ్లైట్ లేట్ అవ్వడం లేదా రద్దు వంటివి జరిగినట్లయితే మీకు బీమా కవరేజీలో భాగంగా హోటల్, భోజన ఖర్చులు కవరేజ్ లభిస్తాయి.
>> కొన్ని సందర్భాల్లో పర్యటనలో భాగంగా మీ లగేజ్ పోయినట్లయితే మీరు ఎంపిక చేసుకున్న కవరేజీలో భాగంగా . బీమా రూపంలో డబ్బు లభిస్తుంది.
>> కొన్ని సందర్భాల్లో ట్రావెలింగ్ సమయంలో అనారోగ్యం లేదా ఆక్సిడెంట్ జరిగినట్లయితే ఆసుపత్రి ఖర్చు వారం లేకుండా మీకు కవరేజీ లభిస్తుంది.
>> మరికొన్ని సందర్భాల్లో బీమా దారుడు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే, వారి కుటుంబానికి పరిహారం లభిస్తుంది.
>> కొన్నిసార్లు విదేశాల్లో పర్యటన చేస్తున్నప్పుడు పాస్పోర్ట్ లేదా ఇతర ముఖ్యమైన వస్తువులు పోయినప్పుడు మీకు నష్టపరిహారం రూపంలో బీమా డబ్బు.
>> విదేశాల్లో ఉన్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీకు ఖర్చులు బీమా రూపంలో కవర్ అవుతాయి.
ట్రావెల్ ఇన్సూరెన్స్ లో కవరేజీ కానివి ఇవే
>> దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పుడు కవరేజీ లభించదు.
>> ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉన్నట్లయితే మీకు కవరేజీ లభించడం కష్టం.
>> హెచ్ఐవి ఎయిడ్స్ అలాగే మానసిక సమస్యలు ఉన్నట్లయితే కవరేజీ లభించదు.
>> గర్భధారణ సంబందిత సమస్యలకు కూడా కవరేజీ లభించదు
>> యుద్ధం వంటి సమస్యల వల్ల కలిగే నష్టాలకు కూడా కవరేజీ లభించదు
>> . మీరు ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో యాక్సిడెంట్ సంభవించినట్లయితే మీకు కవరేజీ లభించదు.
ఎంత కవరేజ్ తీసుకోవాలి?
సాధారణంగా భీమా కవరేజీ అనేది మీ ట్రిప్పును బట్టి నిర్ణయిస్తారు. మీరు తీసుకెళ్లే సామాను విలువ అదేవిధంగా ట్రావెల్ కర్చుల్లో నాలుగు నుంచి ఎనిమిది శాతం ఉండేలా బీమా పాలసీలను ఎంపిక చేసుకోవచ్చు.