Infosys salary hike: జీతాల పెంపుపై ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Infosys salary hike: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్... జీతాలు పెరుగుతున్నాయ్. రేటింగ్, శాలరీ హైక్ పర్సెంటేజ్ ఎలా...

Infosys salary hike: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్... జీతాలు పెరుగుతున్నాయ్
Infosys employees to get salary hike: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో అమెరికాలో ఆర్థిక మాంధ్యం రాబోతోందా అనే ఆందోళనలు నెలకొన్నాయి. అదే కానీ జరిగితే చాలా కంపెనీలకు అమెరికా నుండి వచ్చే ఆర్డర్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీతాల పెంపు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా 4వ త్రైమాసికం ఫలితాల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన కంపెనీ మేనేజ్మెంట్, జీతాల పెంపు ఉంటుందని స్పష్టంచేసింది.
ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు జనవరి నుండే జీతాలు పెరిగాయి. మిగతా వారికి పెరగాల్సి ఉంది. దాంతో తమ పరిస్థితి ఏంటా అని వారు అయోమయంలో ఉన్నారు. ఇదే విషయమై కంపెనీ స్పందిస్తూ ఏప్రిల్ 1 నుండి మిగతా వారికి కూడా జీతాల పెంపు వర్తింపజేస్తామని ప్రకటించింది.
జీతాల పెంపు ఎలా ఉండనుందంటే...
ఇన్ఫోసిస్‌లో టాప్ పర్‌ఫార్మర్స్‌కు కంపెనీ 10-12 శాతం జీతాలు పెంచింది. మిగతా వారికి 5-8 శాతం శాలరీ హైక్ ఉండనుందని తెలుస్తోంది. శాలరీ హైక్ విషయానికొస్తే... ఉద్యోగులను కంపెనీ 4 రకాలుగా విభజించింది. అందులో మొదటి రకం అత్యుత్తమమైన పర్‌ఫార్మెన్స్ కనబర్చిన వాళ్లు కాగా ఉత్తమమైన పర్‌ఫార్మెన్స్ చూపించిన వాళ్లు రెండో రకం. మిగతా రెండు రకాల్లో ఒకటి అంచనాలను అందుకున్న వారు కాగా అంచనాలను అందుకోవాల్సిన వారు చివరి రకం కేటగిరీ పరిధిలోకి వస్తారు. వారి కేటగిరీని బట్టి శాలరీ ఇన్‌క్రిమెంట్ రేటింగ్ ఉంటుంది.