Bank Holiday: ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే.. ఆ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయా?

Good Friday bank holiday: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 18 శుక్రవారం రోజు రాబోతుంది ఇది బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు క్రిస్టియన్ లో నిర్వహిస్తారు.

Update: 2025-04-16 13:58 GMT
Bank Holiday

Bank Holiday: ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే.. ఆ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయా?

  • whatsapp icon

Good Friday bank holiday: గుడ్ ఫ్రైడే ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఈసారి ఏప్రిల్ 18వ తేదీన రానుంది. ఈరోజు క్రిస్టియన్ల జరుపుకుంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 18వ తేదీ బ్యాంకులు బంద్ ఉంటాయా? అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్రాంచులు బంద్ ఉంటాయో తెలుసుకుందాం..

అయితే దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో మీ దగ్గరలో ఉన్న బ్యాంకులు బంద్ ఉన్నాయంటే లోకల్ గా ఉండే బ్యాంకులో జాబితాలను పరిశీలించవచ్చు. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేక సెలవు దినాలు కాకుండా స్థానికంగా ఉండే కొన్ని ప్రత్యేక రోజుల్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ గుడ్ ఫ్రైడే రోజు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతంలో బ్యాంకులు బంద్ ఉంటాయి. ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ,కేరళ, గోవా వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఆన్‌లైన్లో మొబైల్ బ్యాంకింగ్ మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.

ఏప్రిల్ 15 మంగళవారం బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో బంద్ పాటించారు. ఇక ఏప్రిల్ 16 బోహాక్ బిహు సందర్భంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇది మాత్రమే కాదు ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే సందర్భంగా రాజస్థాన్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ జమ్మూ ,కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంది.

అయితే ఆ ఆదివారం ఏప్రిల్ 20వ తేదీ ఈస్టర్‌ పండుగ కాబట్టి ఆ రోజు ఎలాగో ఆదివారం సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 21 త్రిపురలో గరియాపూజ నిర్వహిస్తారు. ఆరోజు బ్యాంకులు బంద్ ఇంకా ఏప్రిల్ 26 నాలుగో శనివారం దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ మరుసటి రోజు ఏప్రిల్ 27 ఆదివారం కాబట్టి యథావిధిగా బంద్ పాటిస్తారు. అయితే ఏప్రిల్ 29 శ్రీ పరశురామ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బంద్ ఉంది. ఇక చివరిగా ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ సందర్భంగా కర్ణాటకలో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.

Tags:    

Similar News