
Gold Rate Today: గోల్డ్ రివర్స్ గేర్..భారీగా దిగివస్తున్న పసిడి ధరలు
Gold Rate Today: బంగారం ధరలు క్రమంగా భారీగా దిగివస్తున్నాయి. ఓ వైపు వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతున్న తరుణంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండంతో ఈక్విటీలతోపాటు అతి విలువైన లోహాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దీంట్లో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధరరూ. 1,050 వరకు తగ్గింది. 99.9శాతం స్వచ్చత కలిగిన బంగారం ధర రూ. 91,250 దిగివచ్చింది. అలాగే 99.5శాతం స్వచ్చత కలిగిన బంగారం ధర అంతే తగ్గి రూ. 89, 750కి చేరుకుంది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలోవెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో 93,200కి దిగివచ్చింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర రూ. 61,98 డాలర్లు ఎగబాకి 3,044.14 డాలర్లకు చేరుకుంది. వెండి 2 శాతం అధికమై 30.41 డాలర్లకు చేరుకుంది. అమెరికా -చైనా దేశాల మధ్య సుంకాల యుద్ధం మరింత ముదురుపడటంతో పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. మరోవైపు యూఎస్ ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ విడుదల చేయబోయే మినిట్స్, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై విశ్లేషకుల దృష్టి సారించారని చెప్పారు.