Business Idea: కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ సీజన్‌లో కాసుల పంట కురిపించే ఐడియా
Summer Business Idea: మండే ఎండలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటున్నారా?

Business Idea: కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ సీజన్‌లో కాసుల పంట కురిపించే ఐడియా
Summer Business Idea: ఏదైనా కొత్త బిజినెస్ చేయాలని యోచిస్తున్నారా? అయితే మీకు బంపర్ ఛాన్స్.. మండు వేసవికాలం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అంతేకాదు మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి. ఈ సమయంలో కొత్తగా బిజినెస్ ప్రారంభించే వారు ఈ వ్యాపారం చేస్తే కాసుల వర్షమే కురుస్తుంది. అలాంటి బిజినెస్ ఐడియా పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం..
ఎండాకాలం ఎక్కువ మంది ప్రజలు చల్లని గాలి, నీటి కోసం తహతలాడుతుంటారు. తద్వారా వాళ్ళ శరీరాన్ని చల్లబరుచుకోవడం, దాహార్తిని తీర్చుకోవడం జరుగుతుంది.. ఇలాంటి సమయంలో దానికి తగ్గట్టుగా మీరు ఒక మంచి బిజినెస్ ప్రారంభించవచ్చు. దీంతో డబ్బులు కూడా బాగా వస్తాయి. అదే ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీ.. నిజంగా ఇప్పుడు ఐస్ క్యూబ్‌లకు ఎండాకాలంలో విపరీతంగా డిమాండ్ ఉంటుంది.. బిజినెస్ ప్రారంభించాలని మీ కల అయితే ఈ ఐస్ క్యూబ్స్ బిజినెస్ చేయండి. కచ్చితంగా లాభాల్లో బాటలో తీసుకువెళ్తాయి.
రిజిస్ట్రేషన్..
అయితే ఈ ఐస్ క్యూబ్ బిజినెస్ చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి ఐస్ క్యూబ్ మేకింగ్ బిజినెస్‌కు సంబంధించి రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇప్పుడు ఒక స్థలం కావాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఈ ఐస్ క్యూబ్ బిజినెస్ ని ప్రారంభించాలి. ఇంకేంటి దాదాపు మీ బిజినెస్ స్టార్ట్ అయినట్టే..
ఆర్డర్ తీసుకోండి..
ఈ ఐస్ క్యూబ్స్ బిజినెస్ ప్రారంభించాలంటే మీరు ముందుగా కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు, కేఫే, జ్యూస్ సెంటర్లో జాబితా తయారు చేసుకోండి. వాళ్లకు మీరు తయారు చేసిన ఐస్ క్యూబ్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఏ బిజినెస్ లో అయినా పరిశుభ్రత, నాణ్యత ఎంతో ముఖ్యం. మంచినీటిని మాత్రమే ఉపయోగించండి. తద్వారా మీ ఐస్ క్యూబ్ బిజినెస్ లాభాల బాటలో అతి తక్కువ సమయంలోనే వెళ్తుంది. ఇది మాత్రమే కాదు ఇప్పుడు రానున్న సమయంలో పెళ్లిళ్లు విపరీతంగా ఉన్నాయి. పెళ్లిళ్లకు కూడా మీ ఐస్ క్యూబ్స్ సరఫరా చేయొచ్చు.
ప్రమోషన్..
ఇప్పుడు మీరు మీ బిజినెస్ ఎలా ప్రమోట్ చేయాలి తెలుసుకుందాం. దీనికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. సోషల్ మీడియా మన చేతిలో ఉండనే ఉంది. వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వేదికగా మీ బిజినెస్ ని ప్రమోట్ చేయండి. అంతేకాదు సరసమైన ధరలోనే మొదటగా మీ బిజినెస్ ని ప్రారంభించండి. రేటు ఎక్కువగా ఉంటే సేల్ అవ్వడం కష్టం. ఈ పోటీ ప్రపంచంలో మీ వ్యాపారం రానించాలంటే తక్కువ ధరలతో పాటు మంచి నాణ్యత అందించడం కూడా ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల రానురాను మీకు కస్టమర్లు పెరిగిపోతారు. మీ బిజినెస్ లాభాల బాటలో నడుస్తుంది. అయితే ఈ బిజినెస్ ప్రారంభించడానికి మీకు మొత్తంగా ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవ్వచ్చు. అయితే లాభాలు వస్తే మాత్రం దానికి మించిన డబ్బులు చూస్తారు.