Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..95వేలకు చేరిన బంగారం ధర

Gold Rate Today: అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. అమెరికా,చైనాల మధ్య సుంకాల పోటీ తీవ్రమైంది. ఈ నేపథ్యంలో సురక్షితంగా భావించే బంగారంపైకి మళ్లీ పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఔన్సు బంగారం ధర అంతర్జాతీయ విపణిలో గురువారం 3164 డాలర్లకు చేరుకుంది. దీన్ని అనుసరించి దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 95వేలకు చేరుకుంది. గురువారం రాత్రి 11.30 గంటల సమయానికి ఔన్సు ధర 3161 డాలర్ల దగ్గర ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 94,500వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ. 94,600 వద్ద ఉంది.