Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర...తులం రూ. 94వేలు ..హైదరాబాద్ లో ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలంటే భయంతో వణికిపోతున్నారు సామాన్యులు. తులం బంగారం కూడా కొనుగోలు చేయలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరిగిపోతుండటంతో భవిష్యత్తులో బంగారం అనే మాటనే రాదేమో అంటున్నారు. కాగా మంగళవారం ఒక్కరోజే బంగారం ధర భారీగా పెరిగింది. ఈ లెక్కన చూస్తుంటు లక్ష రూపాయలు దాటం ఖాయం అనిపిస్తుంది.
కాగా 24క్యారెట్ల మేలిమి బంగారం ధర పది గ్రాములకు మంగళవారం బులియన్ మార్కెట్లో రూ. 94వేలు తాకింది. దీంతో గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ ఔన్సు బంగారం ధర రికార్డు గరిష్టమైన 3147 డాలర్లకు చేరుకోవడదంతో హైదరాబాద్ బంగారం మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 94,200కు చేరుకుంది. రాత్రి 11గంటల సమాయానికి ఔన్సు ధర 3110 డాలర్లకు తగ్గడంతో దేశీయంగా బంగారం ధర రూ. 93,500కు వద్ద ఉంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 10 గ్రాముంల బంగారం ధర రూ. 79, 390 నుంచి రూ. 14,760 వరకు పెరిగింది. కిలో వెండి ధర రూ. 1,01,750 వద్ద ట్రేడ్ అవుతోంది.