Zepto CEO: డెలివరీ బాయ్స్ గురించి చీఫ్‌గా మాట్లాడతారా? పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మండిపడ్డ జెప్టో సీఈఓ!
Zepto CEO: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్టప్ మహాకుంభ్ 2025 జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు.

Zepto CEO: డెలివరీ బాయ్స్ గురించి చీఫ్‌గా మాట్లాడతారా? పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మండిపడ్డ జెప్టో సీఈఓ!
Zepto CEO: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్టప్ మహాకుంభ్ 2025 జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. అయితే, భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలపై జెప్టో సీఈఓ ఆదిత్ పలిచా భారతీయ స్టార్టప్‌ల తరపున గట్టిగా స్పందించారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘ పోస్ట్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.
అసలు విషయం ఏమిటంటే
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్టార్టప్ మహాకుంభ్ 2025లో భారతదేశం, చైనా మధ్య స్టార్టప్ దృశ్యాలను పోల్చుతూ మాట్లాడుతూ, "మనం డెలివరీ బాయ్స్ లేదా గర్ల్స్ కావాలని ఆకాంక్షించాలా? మన దేశం తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాలతో సంతోషంగా ఉందా? మనం సాంకేతిక అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలి" అని అన్నారు.
స్టార్టప్‌లపై ప్రశ్నలు లేవనెత్తుతూ, "యువతను ఛీప్ లేబర్ వైపు నెట్టేస్తున్నారు. తద్వారా సంపన్నులు ఇంట్లో కూర్చొని ఆహారం పొందగలరు" అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, "భారత్ ఇప్పటివరకు సాధించిన దానిపై మనం గర్వపడుతున్నాం, కానీ మనం ఇంకా అత్యుత్తమ స్థాయికి చేరుకోలేదు" అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై పారిశ్రామికవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జెప్టో సీఈఓ ఘాటుగా స్పందన
పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జెప్టో సీఈఓ ఆదిత్ పలిచా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనేక ప్రశ్నలు కూడా సంధించారు. "భారతీయ వినియోగదారుల ఇంటర్నెట్ స్టార్టప్‌లను విమర్శించడం చాలా సులభం. అమెరికా, చైనాలో అభివృద్ధి చెందుతున్న లోతైన సాంకేతికతతో మనల్ని పోల్చడం మరింత సులభం. కానీ నిజం ఏమిటంటే, దాదాపు 1.5 లక్షల మంది నేడు జెప్టో ద్వారా సంపాదిస్తున్నారు" అని ఆయన అన్నారు.
"కేవలం 3.5 సంవత్సరాల క్రితం ఉనికిలో లేని ఒక సంస్థ ఇది. ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల పన్నులు చెల్లించడం, ఒక బిలియన్ డాలర్లకు పైగా FDIని తీసుకురావడం, భారతదేశంలోని బ్యాకెండ్ సరఫరా గొలుసులను క్రమబద్ధీకరించడానికి వందల కోట్ల పెట్టుబడులు పెట్టడం, ఇది భారతీయ ఆవిష్కరణలో అద్భుతం కాకపోతే మరేమిటో నాకు నిజంగా తెలియదు" అని ఆయన పేర్కొన్నారు.
స్టార్టప్‌ల గొప్పతనాన్ని వివరించిన పలిచా
జెప్టో సీఈఓ ఆదిత్ పలిచా మాట్లాడుతూ, "స్టార్టప్‌లు కేవలం ఉద్యోగాలను మాత్రమే ఇవ్వడం లేదు. అవి ఆవిష్కరణలు, సాంకేతికత , ఆర్థిక వ్యవస్థను పెంచడానికి కూడా దోహదం చేస్తున్నాయి." అంతేకాకుండా, ఈ ఎకోసిస్టమ్‌కు వెన్నెముకగా ఉన్న డెలివరీ సిబ్బంది వంటి ఉద్యోగుల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. "భారత్‌కు సొంత AI మోడల్ ఎందుకు లేదు?" అని ఆయన ప్రశ్నించారు.