
Gold Rate Today: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్ ప్రపంచ స్టాక్ మార్కెట్లపైనే కాదు గోల్డ్, క్రూడ్ ఆయిల్ ధరలపైనా తీవ్ర ప్రభావాన్నే చూపుతాయి. ఇండియా ప్రొడక్టులపై 26శాతం టారిఫ్ వేస్తామని ట్రంప్ ప్రకటించిన రెండురోజులుగా మన స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఐదు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర శుక్రవారం కూడా పతనమైంది.
ఆభరణాలు తయారీకి ఉపయోగించే 22క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 1600 తగ్గి 84వేలు వద్ద స్థిరపడింది. గోల్డ్ బిస్కెట్లు, కాయిన్స్ లో వాడే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రూ. 93,380 ఉండగా శుక్రవారం రూ. 1,740తగ్గి రూ. 91,640కి దిగివచ్చింది. వెండి ధర కూడా భారీగానే పడిపోతోంది. గురువారం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. లక్షా12వేలు ఉంది. అది శుక్రవారం రూ. 4వేలు తగ్గి రూ. లక్షా 8వేల వద్ద ఉంది.
పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకున్నా, గ్లోబల్ గా అనిశ్చితి ఏర్పడినా అది స్టాక్ మార్కెట్లతోపాటు గోల్డ్, క్రూడ్ ధరలపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా షేర్ల ధరలు భారీగా పతనం అయ్యాయి. గోల్డ్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. కానీ ఈ సారి ట్రంప్ ప్రకటనపై ప్రపంచ దేశాలు భయపడతున్న ఈ సమయంలో పలు దేశాల స్టాక్ మార్కెట్లతోపాటు బంగారం, క్రూడ్ ధరలు కూడా తగ్గుతున్నాయి.
ఈ పరిస్థితి పెట్టుబడిదారుల భయాన్ని సూచిస్తుందని స్టాక్స్ నుంచి తీసిన మొత్తాన్ని బంగారం, క్రూడ్ వంటి వాటిల్లో పెట్టకపోగా..వాటిల్లోంచి కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.