Piyush Goyal: వామ్మో.. ఒక్కసారే ఇలా అనేశాడేంటి... స్టార్టప్‌ కంపెనీలకు కేంద్ర మంత్రి పంచ్‌లు!

Piyush Goyal: గోయల్ వ్యాఖ్యలు ఒకదిశగా దేశంలో అసలు స్టార్టప్ దిశ ఎటు పోతుందన్న చర్చకు నాంది పలికాయి. కానీ తక్కువ ఖర్చుతో మోడరేట్ ఇన్నోవేషన్ చేసే స్టార్టప్‌లను కించపరిచేలా మంత్రుల మాటలు రావడాన్ని మాత్రం పలువురు వ్యాపారవేత్తలు హర్షించలేదు.

Update: 2025-04-04 15:15 GMT
Piyush Goyal

Piyush Goyal: వామ్మో.. ఒక్కసారే ఇలా అనేశాడేంటి... స్టార్టప్‌ కంపెనీలకు కేంద్ర మంత్రి పంచ్‌లు!

  • whatsapp icon

Piyush Goyal: శార్క్ టాంక్‌ షోకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సడెన్ షాక్ ఇచ్చారు. స్టార్టప్ మహాకుంభ్ వేదికగా జరిగిన ఈ చర్చలో భారత స్టార్టప్ కల్చర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పీచ్చున్న పాయింట్ ఏంటంటే... దేశంలో బిలియనీర్ల పిల్లలు మొదలుపెట్టిన స్టార్టప్‌లు ఇప్పుడు గ్లూటెన్-ఫ్రీ కుకీలపై ఫోకస్ పెడుతున్నాయి. కానీ అదే సమయంలో చైనా స్టార్టప్‌లు ఎలక్ట్రిక్ వాహనాలు, బాటరీలపై పనిచేస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

పీయూష్ గోయల్ దీర్ఘంగా ఏ సంస్థను పేరు ప్రస్తావించనప్పటికీ, శార్క్‌టాంక్‌లో ప్రముఖ బిజినెస్‌మెన్ అమన్ గుప్తా పెట్టుబడి పెట్టిన 'గో జీరో' ఐస్‌క్రీమ్ కంపెనీని టార్గెట్ చేసినట్టు స్పష్టమైంది. గో జీరో అనే నో-షుగర్ ఐస్‌క్రీమ్ బ్రాండ్ ఇటీవలే 1 కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌ను దక్కించుకుంది. ఇది ఒకవైపు గుర్తింపు తెచ్చుకోగా, మరోవైపు ఐస్‌క్రీమ్‌లో ఉపయోగించిన పదార్థాలపై యూజర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అరగంట గడిచినా మెల్ట్ కాకపోవడం వంటి విషయాలు సోషల్ మీడియాలో చర్చకు తెరతీశాయి.

ఇక గోయల్ వ్యాఖ్యలపై స్టార్టప్ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. శార్క్ టాంక్ జడ్జ్ అనుపమ్ మిత్తల్ మాట్లాడుతూ, ఇండియాలో దీప్‌టెక్ కంపెనీలు సిద్ధంగా ఉన్నా, వాటి అభివృద్ధికి అవసరమైన క్యాపిటల్, ఈకోసిస్టమ్ లేవని తెలిపారు. అదే సమయంలో, మాజీ జడ్జ్ ఆశ్నీర్ గ్రోవర్ అయితే మరింత కఠినంగా స్పందించారు. భారత్‌లో రియాలిటీ చెక్ అవసరం ఉన్నవారంటే రాజకీయ నాయకులే అంటూ గోయల్‌ను నిలదీశారు. చైనా మొదట ఫుడ్ డెలివరీ మార్కెట్‌ను అభివృద్ధి చేశాక డీప్ టెక్ వైపు వెళ్లిందని గుర్తు చేస్తూ, ఇండియాలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్‌లు ఉద్యోగాలు కల్పిస్తున్నారని గ్రోవర్ అన్నారు. పొలిటికల్ లీడర్లు దేశ ఆర్థిక వృద్ధి పై దృష్టి పెట్టాలని సూటిగా హితవు పలికారు.

Tags:    

Similar News