Donald Trump-Elon Musk: ఎలన్ మస్క్‌కు ట్రంప్ ద్రోహం.. లక్షల కోట్లు ఊస్ట్!
Donald Trump-Elon Musk: ఒక్క పాలకుడి నిర్ణయం ఎంతటి బలవంతులకైనా ఊహించని తలకిందుల దారిలో నడిపించగలదని ట్రంప్ టారీఫ్‌లు చాటాయి.

Donald Trump-Elon Musk: ఎలన్ మస్క్‌కు ట్రంప్ ద్రోహం.. లక్షల కోట్లు ఊస్ట్!
Donald Trump-Elon Musk: ట్రంప్ తాజా టారీఫ్ ప్రకటన ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేసింది. ఆ ప్రభావం ఓ రాత్రిలోనే కనిపించింది. ఒకే ఒక్క రోజులో దాదాపు 500 మంది బిలియనీర్ల సంపద గాలిలో కలిసిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, కోవిడ్ తరువాత ఈ స్థాయిలో సంపన్నులు నష్టాన్ని చూడడం ఇదే మొదటిసారి. నష్టం అంచనా వేసినప్పుడు దాదాపు 17.72 లక్షల కోట్ల రూపాయలు విలువైన సంపద ఊస్ట్ అయ్యింది.
అమెరికాలోని పెద్దస్థాయి వ్యాపారవేత్తలు — టెక్ దిగ్గజాల నుంచి రిటైల్ చాంపియన్ల వరకు — ఈ విధంగా తాట తీస్తారని ఊహించలేదు. ట్రంప్ విధించిన ఈ రిసిప్రోకల్ టారీఫ్‌ల ప్రభావం ప్రత్యేకంగా అమెరికా మిలియనీర్లపై ఎక్కువగా పడింది.
అటు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ట్రంప్‌ను ఓ వ్యక్తిగత మద్దతుదారుడిగా చెప్పుకునే మస్క్‌కు ఈసారి తానే గట్టిగా దెబ్బ తిన్నారు. టారీఫ్‌లు అమల్లోకి వచ్చిన తర్వాత మస్క్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. టెస్లా వంటి ఎలక్ట్రిక్ వెహికల్ మేజర్ కంపెనీ మార్కెట్ విలువలో 11 బిలియన్ డాలర్ల నష్టం సంభవించింది.
ఇక అమెజాన్ కూడా తీవ్రంగా దెబ్బ తిన్న సంస్థలలో ఒకటి. 2022 తర్వాత అమెజాన్ ఇంతగా నష్టాన్ని చూడలేదు. జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపద నుంచే 15.9 బిలియన్ డాలర్ల నష్టం నమోదైంది. కంపెనీ స్టాక్స్ తలకిందులైపోయాయి.
మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ లాంటి ప్రముఖులపై కూడా టారీఫ్ ప్రభావం చూపింది. సోషల్ మీడియా, ఈ-కామర్స్, టెక్నాలజీ రంగాల్లో భారీ ఇన్వెస్టర్లకు ఈ ఒక్కరోజు సీక్రెట్ షాక్‌లా మారింది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది బిలియనీర్లకు ఈ నిర్ణయం నిద్ర లేకుండా చేసింది. వ్యాపారంలో లాభనష్టాలు సాధారణమే అయినా, పాలకుల అనూహ్య చర్యల వల్ల మార్కెట్లు కుదేలవ్వడం మాత్రం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వాణిజ్య సంబంధాలను మాత్రమే కాదు, సంపదనూ తుంచేస్తున్నాయి.