Gold Rate: రూ. 113కే గ్రాము బంగారం.. బిల్లు చూస్తే కొనేందుకు పరుగెడతారు.. ఇంతకు ఎక్కడో తెలుసా?

Gold Rate: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.94,350కి చేరుకుంది. త్వరలోనే లక్ష రూపాయలు దాటడం ఖాయమంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అయితే 1959లో తులం బంగారం లభించేది. అంటే నేడు ఒక చాక్లెట్ ధర..తులం బంగారంతో సమానం అని చెప్పవచ్చు.
సోషల్ మీడియాలో ఓ పాత బిల్లు వైరల్ గా మారింది. ఆ బిల్లు 1959 నాటిది. అందులో మహారాష్ట్ర వామన్ నింబాజీ అష్టేకర్ దుకాణంలో కొనుగోలు చేసినట్లు ఉంది. అక్కడ తులం బంగారం ధర రూ. 113 అని ఉంది. ఇంటర్నెట్లో సెర్చ్ చేసే ఈ దుకాణం పూణేలో ఇప్పటికీ ఉంది. 1959లో బంగారం చాలా చౌకగా ఉండేది. మధ్యతరగతి కుటుంబాలు కూడా సులభంగా ఆభరణాలు కొనుగోలు చేసేశారు. అప్పట్లో ఆ బంగారం కొనేందుకు కూడా లోన్స్ తీసుకునేవారు. అయితే ఇప్పుడు పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలంటే జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 94,350. 22 క్యారెట్ల ధర రూ.86,560 18 క్యారెట్ల ధర రూ.70,040. బంగారం ధర రూ.200 పెరగడం కొత్త రికార్డును సృష్టించింది.వెండి ధరలో కొంత ఉపశమనం ఉంది. కానీ అది కూడా తక్కువ కాదు. 1 కిలో వెండి ధర రూ. 1,03,000, ఇది రూ. 2000 తగ్గింది. అయినప్పటికీ, వెండి కొనడం నేడు అందరికీ అందుబాటులో లేదు.