Rail Ticket: రైల్వే సీట్లు అందుబాటులో లేవా? అయితే M కోచ్ బుక్ చేసుకుని హాయిగా ప్రయాణించండి..!
Rail Seat Booking: రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు టికెట్ ధరలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు.
Rail Seat Booking: మనదేశంలో ఇండియన్ రైల్వే అతి పెద్ద రవాణా వ్యవస్థ. ప్రతిరోజు లక్షల మంది ఈ రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించే ఈ రైల్వే సంస్థ ద్వారా సౌకర్యం అంతగా ప్రయాణం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది భారతీయులు ప్రతిరోజూ ప్రయాణం చేస్తారు. రైల్వేలో SL, జనరల్, 1A, 2A, 3A వంటి కేటగిరీలతో కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే చాలా సార్లు రైల్వే కోచ్‌లు అందుబాటులో ఉండక త్వరగా భర్తీ అయిపోతాయి. అది పెద్ద తలనొప్పిగా మారుతుంది. సమయానికి రైలు సీట్లు అందుబాటులో ఉండవు అప్పుడు కొత్తగా చేసిన M అనే కోచ్‌లో మీరు సీట్లు సౌకర్యవంతంగా బుక్ చేసి హాయిగా ప్రయాణం చేయవచ్చు
M కోచ్ అంటే ఏంటి తెలుసుకుందాం..
2021 నుంచి 3AC కోచ్‌కు అదనంగా కొన్ని కోచ్లను చేర్చారు. వాటికి M అనే కోడ్ పెట్టారు. దీంతో సౌకర్యవంతంగా రైలు ప్రయాణం చేయవచ్చు. ఇది సాధారణ ఎకానమీ కోర్సుల కంటే సౌకర్యవంతంగా అధునాతనంగా ఉంటుంది. ఏసీ 3 టైర్ కంటే కొత్తది దీని రూపకల్పన కూడా అద్భుతం. ౩ ఏసి ఎకానమీ కోచ్ ప్రతి సీటు ప్రయాణికుడికి అనుకూలంగా ఒక లైటింగ్ ,బాటిల్ స్టాండ్ ప్రత్యేకమైన బాత్రూమ్ కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో ఈ ఏసీ 3లో సులభంగా ప్రయాణం చేయవచ్చు. మొత్తంగా 72 సీట్లు ఉంటాయి. అయితే ఏసి 3 ఎకానమీలో మరో 11 సీట్లు అదనంగా చేర్చారు మొత్తంగా 83 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ 3 ఏసీలో కూడా ఏసీ3 టైర్ మాదిరిగానే సౌకర్యవంతమైన కోచ్, ధర కూడా దాని కంటే తక్కువగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. పెద్ద తేడా ఏమీ ఉండదు. M1, M2 కోడ్ తో పిలుస్తారు డబ్బాలపై రాస్తారు.