
Gold Rate Today: గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు నేడు కాస్త బ్రేక్ పడింది.దేశవ్యాప్తంగా నేడు ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజు బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ధర రూ. 96,670గా ఉంది. 22క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 87, 700గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 95,820గా ఉంది. 22క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 87, 850కి చేరుకుంది. ఈ క్రమంలో బంగారం ధరలు గత వారం రోజుల్లో రూ. 5010 పెరిగింది.
ఇదే బంగారం ధరలు ఏప్రిల్ 6వ తేదీన 24 క్యారెట్ల పది గ్రాములకు రూ. 90, 660గా ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ 13న రూ. 95,670 ఉంది. వారం రోజుల్లో 5వేల రూపాయలకు పైగా పుంజుకుంది. మరోవైపు ఏప్రిల్ 6న వెండి ధరలు హైదరాబాద్, విజయవాడలో రూ. 1,03,000 ఉంది. ప్రస్తుతం రూ. 1,10,000కి చేరుకుంది. అంటే వెండి కూడా బంగారం కంటే ఎక్కువగా 7వేల రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో వీటిపై పెట్టుబడులు చేసిన ఇన్వెస్టర్లు ఈ వారంలో మంచి లాభాలను దక్కించుకున్నారు.