PAN Card: పాన్ కార్డ్ ఎక్సపైరీ అయిందా ? ఒకటి కంటే ఎక్కువ కార్డులున్నాయా.. అయితే భారీ జరిమానా తప్పదు..!

PAN Card: పాన్ కార్డ్ (PAN Card) ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైన ధృవీకరణ పత్రాల్లో ఒకటి.

Update: 2025-04-24 06:45 GMT
Is Your PAN Card Expired Check its Validity Now

PAN Card: పాన్ కార్డ్ ఎక్సపైరీ అయిందా ? ఒకటి కంటే ఎక్కువ కార్డులున్నాయా.. అయితే భారీ జరిమానా తప్పదు..!

  • whatsapp icon

PAN Card: పాన్ కార్డ్ (PAN Card) ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైన ధృవీకరణ పత్రాల్లో ఒకటి. ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడం నుండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వరకు , KYC వంటి అనేక ఆర్థిక అవసరాల కోసం పాన్ కార్డ్ తప్పనిసరి. ఇది చట్టపరమైన గుర్తింపు కార్డుగా కూడా పరిగణిస్తారు. మీ క్రెడిట్ హిస్టరీని ట్రాక్ చేయడానికి ఆధార్ కార్డ్‌ను పాన్ కార్డ్‌తో అనుసంధానిస్తారు. అయితే, పాన్ కార్డ్ కూడా గడువు ముగుస్తుందా అనే ప్రశ్న మీ మనసులో వచ్చిందా.. దాని గురించి తెలుసుకుందాం.

ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఏమి చేయాలి?

మీరు ఎప్పుడైనా మీ పాన్ కార్డ్ ఎక్సపైరీని గమనించారా?.. పాన్ కార్డ్‌ను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ జారీ చేస్తుంది. ఒక వ్యక్తి మరణించే వరకు పాన్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది. దానికి ఎక్సపైరీ డేట్ అనేది ఉండదు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే పాన్ కార్డ్‌ను రద్దు చేస్తారు. మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా పాన్ కార్డ్‌ను మూసివేస్తారు. కాబట్టి ఇది జీవితాంతం చెల్లుబాటులో ఉంటుంది. ఇది పది అంకెల సంఖ్య, ఇందులో వ్యక్తి పూర్తి సమాచారం ఉంటుంది. ఎవరైనా ఒకరి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండకూడదు. ఒకవేళ ఎవరి వద్దైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే వారిపై జరిమానా విధించవచ్చు.

ఎంత జరిమానా విధిస్తారు?

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272B ప్రకారం, ఎవరైనా ఒకరి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉంటే వారిపై పది వేల రూపాయల జరిమానా విధించవచ్చు. ఒక వ్యక్తికి పొరపాటున ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు జారీ అయితే, అటువంటి సందర్భంలో వారు ఒక పాన్ కార్డ్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కూడా సరెండర్ చేయవచ్చు.

ఇంట్లోనే పాన్ కార్డ్ పొందవచ్చు

మీరు కోరుకుంటే ఇంట్లో కూర్చొని కూడా పాన్ కార్డ్ పొందవచ్చు. దీని కోసం మీరు ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లాలి. ఆ తర్వాత ఆధార్ ద్వారా క్విక్ పాన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు గెట్ న్యూ పాన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. మీరు ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTP ధృవీకరణ తర్వాత మీ ఇ-పాన్ కార్డ్ జారీ చేయబడుతుంది. మీరు కోరుకుంటే ఈ ఇ-పాన్ ద్వారా ఫిజికల్ కార్డును కూడా పొందవచ్చు.

Tags:    

Similar News