Gold Rate Today: ట్రంప్ ప్రకటనతో భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: ట్రంప్ ప్రకటనతో భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. నేడు ఏప్రిల్ 24వ తేదీ గురువారం బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదు అయ్యింది. క్రితం రోజు బంగారం ధర పది గ్రాములకు ఏకంగా రూ. 3000 మేర తగ్గింది. దీంతో బంగారం ధర రూ. లక్ష దిగువకు వచ్చిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు..డాలర్ తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏప్రిల్ 24వ తేదీ నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 98, 240 ఉండగా..22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ. 90,050 హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెల్లరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే వీటి ధరలు వరుసగా రూ. 100, రూ. 110 చొప్పున తగ్గాయి.