PF Withdrawal Rules: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. అప్లై చేసుకున్న 3 రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమా..!

PF Withdrawal Rules: గతంలో పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేయాలంటే కొన్ని రోజుల సమయం పట్టేది. ఒక్కోసారి 15 రోజులు కూడా పడుతుంది.

Update: 2025-04-01 08:00 GMT

PF Withdrawal Rules: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. అప్లై చేసుకున్న 3 రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమా..!

PF Withdrawal Rules: పీఫ్‌ ఖాతాదారులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌. ఏప్రిల్‌ 1 అంటే నేటి నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా మరింత సులభతరం కానుంది. కేవలం 3 రోజుల్లోనే పీఎఫ్‌ ఖాతాదారులకు తమ డబ్బు జమా అయిపోతుంది. ఇది ఖాతాదారులకు పండుగ చేసుకునే వార్త. ఈపీఎఫ్‌ఓ ప్రతి నెలా ఖాతాదారుల నుంచి కొంత డబ్బు జమా చేస్తుంది. అది అవసరాలకు ఉద్యోగుల ఖాతాల్లో జమా చేస్తుంది. ప్రధానంగా పెళ్లి, చదవు, ఇల్లు కట్టుకోవడం, ఆరోగ్య సమస్యలకు ఈ డబ్బు క్లెయిమ్‌ చేసుకునే సౌలభ్యం కల్పించారు. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని అనుసరించి డబ్బులు ఖాతాదారుల ఖాతాల్లో జమా చేస్తుంది. అయితే గతంలో అవసరానికి డబ్బు అందక కళ్లలో వత్తీలు వేసుకుని ఎదురు చూసే దుస్థితి ఉండేది.

ఆ విధానానికి కేంద్ర ప్రభుత్వం చెక్‌ పెట్టింది. మీకు పీఎఫ్‌ డబ్బులు అవసరమైతే దరఖాస్తు చేసుకున్న కేవలం 3 రోజుల్లోనే మీ ఖాతాల్లో జమా అయిపోతుంది. అది 2025 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమలు కానుంది. ఇది మాత్రమే కాదు క్లెయిమ్‌ డబ్బుల పరిమితిని కూడా రూ.5 లక్షల వరకు అడ్వాన్స్‌ క్లెయిమ్‌ కూడా పెంచింది. అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యల రీత్యా మీరు ఒక్కరోజే లక్ష వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆటో డెబిట్‌ ద్వారా మూడు రోజుల్లోనే ఈ డబ్బు పొందవచ్చు. 95 శాతం పీఎఫ్‌ క్లెయిమ్స్‌ ఆటో ప్రాసెస్‌ ద్వారానే అవుతోంది.

పీఎఫ్‌ ఆటో డెబిట్‌ ద్వారా మీరు డబ్బులు క్లెయిమ్‌ చేయాలంటే ముందుగా మీ ఆధార్‌, బ్యాంక్‌పాస్‌ బుక్‌, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌, నామినీ కూడా లింక్‌ చేయాలి. ఈకేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. అయితే, అతి త్వరలో ఏటీఎం ద్వారా పీఎఫ్‌ డబ్బులు డ్రా చేసుకునే సౌలభ్యం కూడా త్వరలో కలుగునుంది. ఈ ఏడాది జూన్‌ నెలలో ఏటీఎం ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యూపీఐ విధానంలో కూడా పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా చేసుకునేలా యోచిస్తోంది.

Tags:    

Similar News