Credit Score: మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవాలా? అయితే ఈ చిన్న టిప్స్ పాటించండి
Credit Score Improve: క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడితే భవిష్యత్తులో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా.. ఇతర ఆర్థిక రుణాలు పొందాలన్నా కూడా పెద్ద ప్రభావమే పడుతుంది.

Credit Score: మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవాలా? అయితే ఈ చిన్న టిప్స్ పాటించండి
Credit Score Improve: ఏ బ్యాంకులైనా లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థలైన కానీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటేనే ఒక వ్యక్తికి లోన్స్ ఇతర సదుపాయాలు అందిస్తాయి. అయితే రుణాల చెల్లింపులో ఏమాత్రం జాప్యం జరిగినా కానీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. తద్వారా రానున్న రోజుల్లో వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే క్రెడిట్ స్కోర్ మెరుగు చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి.
క్రెడిట్ స్కోర్ మెరుగుగా ఉంటే ఏ బ్యాంకుల్లో అయినా లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో అయినా గాని తక్కువ రేట్లను వడ్డీలకు రుణాలను అందిస్తారు. అయితే బ్యాంకు రుణం తీసుకుంటే ఒక నిర్దిష్ట నెలలో కచ్చితంగా ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే అది క్రెడిట్ స్కోర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. సకాలంలో లోను చెల్లించలేని వారి క్రెడిట్ స్కోర్ డౌన్ అయిపోతుంది. తద్వారా వారి క్రెడిట్ స్కోరుపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈఎంఐలు ఆలస్యమైనా కానీ భవిష్యత్తులో ఇది రుణాలు మంజూరుకు తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది . అయితే అలాంటి వారు క్రెడిట్ స్కోర్ మెరుగు చేసుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
క్రెడిట్ స్కోర్ మెరుగు చేసుకోవాలంటే క్రెడిట్ కార్డు తరచూ ఉపయోగించండి. కానీ, ఆ రుణాలను సకాలంలో మీరు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఇది మీ క్రెడిట్ హిస్టరీ పై ప్రభావం చూపదు. సమయానికి చెల్లించే రుణాలు మంచి హిస్టరీని అందిస్తాయి. అంతేకాదు ఎక్కువ రుణాలు ఉంటే వాటిని వెంటనే సమయానికి చెల్లించండి. చెక్ బౌన్స్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
మీ అవసరానికి మించి క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే దాని ఖర్చులు పెరగడం వల్ల చెల్లింపుల్లో ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో మీరు సమయానికి డబ్బులు చెల్లించలేరు. దీంతో అది క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. మీ తాహతకు మించి రుణాలు తీసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ పడిపోతుంది ఉన్న లోన్లకు మించి ఇతర వస్తువులు కొనుగోలు చేయకపోవడమే మంచిది. లేకపోతే అది రానున్న కాలంలో మీ క్రెడిట్ హిస్టరీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది.