గుండె, డయాబెటీస్ సహా పెరగనున్న 900 రకాల మందులు: ఎంతో తెలుసా?
Medicine Price Hike: గుండె జబ్బు, మధుమేహం సహా ఇతర రోగాలకు సంబంధించి ఉపయోగించే 900లకు పైగా ముఖ్యమైన మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి.
గుండె, డయాబెటీస్ సహా పెరగనున్న 900 రకాల మందులు: ఎంతో తెలుసా?
Medicine Price Hike: గుండె జబ్బు, మధుమేహం సహా ఇతర రోగాలకు సంబంధించి ఉపయోగించే 900లకు పైగా ముఖ్యమైన మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. వీటి ధరలు 1.74 శాతం పెరుగుతాయి. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మాసూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ఎన్‌పీపీఏ ప్రకటించింది.
మందుల ధరలు ఎంత పెరిగాయంటే?
ఎసికోవిర్ వంటి యాంటివైరల్ 200 ఎంజీ టాబ్లెట్ ధర రూ.7.74, 400 ఎంజీ ధర రూ.13.09, యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ 200ఎంజీ ధర రూ.6.47, 400 ఎంజీ ఒక టాబ్లెట్ ధర రూ.14.04 గా నిర్ధారించారు. యాంటి బయాటిక్ అజిత్రోమైసిన్ 250 ఎంజీ ఒక్క టాబ్లెట్ ధర 11.87, 500 ఎంజీ ధర రూ.23.97 కు పెరిగింది. పెయిన్ కిల్లర్ డైక్లోఫెనాక్ టాబ్లెట్ ధర రూ.2.09, ఇబ్రూపెన్ టాబ్లెట్ 400 ఎంజీ ధర రూ.1.22 గా నిర్ణయించారు.అనస్తీషియా, యాంటీ అలెర్జిక్ మందులు, నాడీ సంబంధి రుగ్మతలు, గుండె, చెవి, ముక్కు, గొంతు సహా ఇతర రోగాలకు ఉపయోగించే మందుల ధరలు పెరగనున్నాయి. పారాసిటమాల్, అజిత్రోమైసిన్, రక్తహీనత నిరోధక టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్ల ధరలు పెరిే అవకాశం ఉంది.
మందుల ధరలను ఎవరు నిర్ణయిస్తారు?
ప్రబుత్వ జాతీయ ఔషద ధరల అథారిటీ మందుల ధరలను నిర్ణయిస్తుంది. గత ఏడాది టోకు ధరల సూచిక డబ్ల్యుపీఐ ఆధారంగా ప్రతి ఏటా ధరలు మారుతాయి. 2023 క్యాలెండర్ ఇదే సమయంలో కంటే2024 క్యాలెండర్ సంవత్సంలో డబ్ల్యుపీఐ వార్షిక మార్పు (+) 1.74028% గా ఉంది. డబ్ల్యు పీఐ ఆధారంగా ఫార్మా సంస్థలు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే ధరలు పెంచుకొనే అవకాశం ఉందని ఎన్‌పీపీఏ తెలిపింది.
స్టెంట్ల ధరలు కూడా పెరిగే ఛాన్స్
డబ్ల్యుపీఐ ప్రకారం స్టెంట్లు తయారు చేసే సంస్థలు కూడా వాటి ధరలను 1.74 శాతం సవరించుకొనే అవకాశం ఉంది. బేర్-మెటల్ స్టంట్లపై సీలింగ్ ధరను రూ.10,692కు సవరించారు. బయోరిసోర్సబుల్ వాస్కులర్ స్కాపోల్డ్ బీవీఎస్ స్టంట్ ధర రూ38,933.14 గా ఫైనల్ చేశారు.