Gold Rate Today: కాస్త ఊరట లభించినట్లే.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు బ్రేక్ పడింది. దీంతో ఈ రోజు దేశవ్యాప్తంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. బంగారం గ్రాముకు 2 రూపాయలు తగ్గగా..వెండి కేజీకి రూ. 200 తగ్గింది. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే ఇంకొన్ని సార్లు తగ్గుతుంటాయి. గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం వెండి, బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం ప్రపంచధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితం అవుతుంటాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. గత ఏడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తున్నాయి.
అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోవసారి పగ్గాలు చేపట్టిన తర్వాత బంగారం ధర పెరిగింది. ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు భయాందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మదుపరులంతా బంగారంని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 2 రూపాయలు తగ్గింది. 1 గ్రాము రూ. 8, 509గా ఉంది. 10 గ్రాముల ధర రూ. 85,090గా ఉంది. అలాగే 24క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 2 రూపాయలు తగ్గింది. ఒకగ్రాము రూ. 9, 283గా ఉంది. 10 గ్రాముల ధర రూ. 92,830గా ఉంది. ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అటు హైదరాబాద్ లో కిలో వెండి 200 తగ్గింది. దీంతో 1,13,900కు చేరుకుంది. విజయవాడ, విశాఖలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
కోల్‌కతా- రూ.85,090, రూ.92,830
చెన్నై- రూ.85,090, రూ.92,830
బెంగళూరు- రూ.85,090, రూ.92,830
పుణె- రూ.85,090, రూ.92,830
అహ్మదాబాద్- రూ.85,140, రూ.92,880
భోపాల్- రూ.85,140, రూ.92,880