Zomato lays off: ఉద్యోగులకు జొమాటో భారీ షాక్‌.. వారందరి జాబ్స్‌ ఊస్ట్!

Zomato lays off: జొమాటో 600 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తొలగించింది. AI ఆధారిత సేవల వల్ల మానవ శక్తి అవసరం తగ్గిందని ఉద్యోగుల ఆరోపిస్తున్నారు.

Update: 2025-04-01 15:30 GMT

Zomato lays off: ఉద్యోగులకు జొమాటో భారీ షాక్‌.. వారందరి జాబ్స్‌ ఊస్ట్!

Zomato lays off: జొమాటో డెలివరీ రంగంలో మందగమనం నేపథ్యంలో, ఖర్చులను తగ్గించేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. తాజాగా, జొమాటో సుమారు 600 కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

జొమాటో ఇటీవల నగ్గెట్ అనే AI ఆధారిత కస్టమర్ సపోర్ట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇది ఇప్పటికే Zomato, Blinkit, Hyperpure వంటి విభాగాల్లో నెలకు లక్షల ఇన్టరాక్షన్లను అటోమెటిక్‌గా నిర్వహిస్తోంది. ఫలితంగా మానవ శక్తిపై ఆధారపడే అవసరం తగ్గిపోతుంది. ఈ ఆటోమేషన్ వలనే తమ ఉద్యోగాలు మళ్లీ అవసరం లేని విధంగా మారాయని బాధితులు అభిప్రాయపడుతున్నారు.

ఇక Blinkit డివిజన్ నష్టాలను ఎదుర్కొంటుండగా, ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో కూడా వృద్ధి మందగమనంలో ఉంది. ఇటీవల సహ వ్యవస్థాపకురాలు అక్తి చోప్రా సహా పలువురు కీలక నేతలు కంపెనీని వీడటం కూడా అంతర్గత స్థాయిలో అనిశ్చితిని కలిగించింది. 2025 ఆర్థిక సంవత్సర తృతీయ త్రైమాసికానికి జొమాటో ఆదాయంలో 64 శాతం వృద్ధి నమోదయినా, లాభం మాత్రం ఏడాది తేడాలో 57 శాతం పడిపోయింది. రూ.5,404 కోట్ల ఆదాయానికి గాను పన్నుల తరువాత లాభం గణనీయంగా తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది.

Tags:    

Similar News