Investments: ఈ కాలంలో 5 ప్లాన్స్‌లో కచ్చితంగా ప్రతిఒక్కరూ పెట్టుబడిపెట్టాల్సిందేనట

5 Investment Plans: డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. వాటిని భద్రంగా దాచిపెట్టుకోవడం, వివిధ భద్రమైన మార్గాల్లో పెట్టుబడులు కూడా పెట్టాలి.

Update: 2025-04-07 13:57 GMT

Investments: ఈ కాలంలో 5 ప్లాన్స్‌లో కచ్చితంగా ప్రతిఒక్కరూ పెట్టుబడిపెట్టాల్సిందేనట

5 Investment Plans: డబ్బు వివిధ భద్రమైన ప్లాన్లలో పెట్టుబడుటు పెట్టడం ఎంతో ముఖ్యం. తద్వారా దానిపై రాబడి కూడా పొందుతారు. అయితే, ప్రతి ఒక్కరూ ఈ 5 మార్గాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేకపోతే వారి భవిష్యత్తు అవసరాలు తీర్చుకోలేరు.

గోల్డ్‌..

గోల్డ్‌ ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులు ఉంటాయి. పదేళ్ల ముందు.. ఇప్పుడు బంగారం ధరలు పోలిస్తే మీ కళ్లే మిమ్మల్ని నమ్మలేవు. అందుకే ప్రతిఒక్కరూ ఏదైనా గోల్డ్‌ ప్లాన్‌లో పెట్టుబడులు పెట్టాలి. కొద్దికొద్ది మొత్తంలో బంగారం కొనుగోలు చేసి పెట్టుకుంటే అది మన భవిష్యత్తు అవసరాలను తీరుస్తుంది.

ఫిక్సెడ్‌ డిపాజిట్‌..

బ్యాంకు ఖాతా ఉన్న అందరూ ఫిక్సెడ్‌ డిపాజిట్‌ కూడా నిర్వహించాలి. ఇతర ఖాతాల కంటే ఎఫ్‌డీలో అధిక మొత్తంలో వడ్డీ అందిస్తాయి బ్యాంకులు. అంతేకాదు బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే సేఫ్‌ కూడా. సేవింగ్స్‌ లేదా ఫిక్సెడ్‌ డిపాజిట్‌లో డబ్బులు దాచుకోవాలి.

మ్యూచువల్‌ ఫండ్‌ SIP:

సిప్‌లలో కూడా డబ్బులు పెట్టుబడులు పెడితే ఇతర రంగాల కంటే ఎక్కువ లాభాలు గడిస్తారు. అయితే ఇందులో కాస్త రిస్క్‌ కూడా ఉంటుంది. మంచి ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్‌ సలహా తీసుకుని పెట్టుబడులు పెడితే మంచిది. అంతేకాదు ఇందులో ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెడితే బెట్టర్‌.

ఇన్సూరెన్స్‌..

మీ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ పెట్టుబడుల్లో ఇన్సూరెన్స్‌ కూడా తప్పనిసరి. మీ కష్ట కాలంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీ కోసం ఓ భద్రమైన ప్లాన్‌ను ఎంచుకోండి.

పీపీఎఫ్‌..

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ను పీపీఎఫ్‌ అని పిలుస్తారు. ఇది కూడా మన దేశంలో ఎంతో ప్రముఖమైన స్కీం. ఇందులో కూడా మీరు డబ్బులు పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందుతారు. ఇందులో దాదాపు 7.1 శాతం వడ్డీ పొందుతారు.

Tags:    

Similar News