Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సి వస్తుంది. గతంలో ట్రంప్ నిర్ణయాలతోపాటు పలు అంశాల కారణంగా 92వేల స్థాయికి చేరుకున్న 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 90వేల రూపాయల పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు గురించి తెలుసుకుందాం.
ఏప్రిల్ 7వ తేదీ సోమవారం గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ఉదయం 6గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 90, 650గా ఉంది. 22క్యారెట్ల ధర పది గ్రాములకు రూ. 83,090గా ఉంది. ఈ ధరలు గత రేట్లతో పోలిస్తే 100 రూపాయలు తగ్గింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల బంగరాం ధర 10 గ్రాములకు రూ. 90, 800కి చేరుకుంది. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 83, 240గా ఉంది. మరోవైపు దేశంలో వెండి ధరలు కిలోకు వెయ్యి రూపాయలు తగ్గింది. రూ. 93, 900గా ఉంది.
ముంబైలో రూ.90,650, రూ.83,090
జైపూర్లో రూ.90,800, రూ.83,240
కోల్‌కతాలో రూ.90,650, రూ.83,090
అహ్మదాబాద్లో రూ.90,700, రూ.83,140
చెన్నైలో రూ.90,650, రూ.83,090
బెంగళూరులో రూ.90,650, రూ.83,090
న్యూఢిల్లీలో రూ.90,800, రూ. 83,240
విశాఖపట్నంలో రూ.90,650, రూ.83,090