Black Monday: ప్రెసిడెంట్ చేసిన ఆ ఒక్క తప్పు.. బ్లడ్ బాత్‌కు దారి తియ్యనుందా? మార్కెట్లు ముక్కలు అవ్వనున్నాయా?
Black Monday: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లు ఎంతో అస్థిరంగా మారాయి. ట్రంప్ విధించిన టారీఫ్‌లు వ్యాపార ప్రపంచాన్ని ఊగిసలాడించగా, చైనా మొదలైన దేశాలు కౌంటర్ టారిఫ్‌లతో కౌంటర్ ఇస్తున్నాయి.

Black Monday: ప్రెసిడెంట్ చేసిన ఆ ఒక్క తప్పు.. బ్లడ్ బాత్‌కు దారి తియ్యనుందా? మార్కెట్లు ముక్కలు అవ్వనున్నాయా?
Black Monday: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొత్త టారీఫ్‌లు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికన్ మార్కెట్ వ్యాఖ్యాత జిమ్ క్రామర్ ఆందోళనకర హెచ్చరిక చేశారు. సోమవారం నాటికి మార్కెట్లు 1987 'బ్లాక్ మండే' తరహా కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పట్లో డౌ జోన్స్ ఒక్క రోజులో 22.6 శాతం పడిపోయిన సంగతి గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
అమెరికా ఇటీవల అన్ని దేశాల దిగుమతులపై 10 శాతం బేస్‌లైన్ టారీఫ్ విధించింది. దీని ప్రభావంతో అమెరికా మార్కెట్లు రెండు రోజుల్లోనే భారీగా నష్టపోయాయి. S&P 500, డౌ జోన్స్, నాస్‌డాక్ వంటి ప్రధాన సూచీలు వరుసగా 6%, 5.5%, 5.8% మేర పతనమయ్యాయి. ఒకే వారం వ్యవధిలో ఇది కోవిడ్ సమయంలో వచ్చిన మార్కెట్ కుదేలైన తర్వాతనే అత్యంత దారుణమైన పరిస్థితి. ఈ రెండు రోజుల్లో డౌ జోన్స్ 3,900 పాయింట్లకు పైగా పడిపోయింది. యూరప్, ఆసియా మార్కెట్లు కూడా అదే దిశగా నడిచాయి.
జిమ్ క్రామర్ మాటల ప్రకారం, ట్రంప్ ప్రతీకార చర్యలు విధించని దేశాలకు సానుకూలంగా స్పందిస్తేనే పరిస్థితి కొంత మెరుగవుతుంది. లేకపోతే, 1987 తరహా మార్కెట్ పతనం మళ్లీ సంభవించే అవకాశాన్ని ఆయన గణిస్తున్నారు. అయితే అమెరికా ప్రస్తుతం నమ్ముకుంటున్నది ఉద్యోగ గణాంకాలపై. అవి బలంగా ఉన్నాయనే కారణంతో ఆర్థిక మాంద్యం రాకుండా నిలబెడతాయని క్రామర్ విశ్లేషిస్తున్నారు. కానీ క్రామర్ గతంలో చేసిన కొన్ని అంచనాలు పూర్తిగా తప్పిపోయిన సందర్భాలున్నాయి. 2007-08 ఆర్థిక సంక్షోభ సమయంలో కొన్ని పెద్ద బ్యాంక్ షేర్లపై ఆయన పెట్టిన నమ్మకాన్ని విమర్శలు ఎదుర్కొన్నాయి. అందువల్ల ఈసారి ఆయన చెబుతున్న మార్కెట్ పతన భవిష్యవాణి కూడా కొంత సందేహంగా చూస్తున్నవారు లేకపోలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లు ఎంతో అస్థిరంగా మారాయి. ట్రంప్ విధించిన టారీఫ్‌లు వ్యాపార ప్రపంచాన్ని ఊగిసలాడించగా, చైనా మొదలైన దేశాలు కౌంటర్ టారిఫ్‌లతో కౌంటర్ ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో మార్కెట్ అనిశ్చితి ఎటువైపు మలుపు తిరుగుతుందనేది త్వరలోనే తేలనుంది.