Stock Market Crash: స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే.. ఆరంభంలోనే కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Black Monday 2.0: ట్రంప్ టారిఫ్ ల ప్రభావం స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి.

Stock Market Crash: స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే.. ఆరంభంలోనే కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Black Monday 2.0: ట్రంప్ టారిఫ్ ల ప్రభావం స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనం అయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 3వేల పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ వెయ్యి పాయింట్లకుపైగా పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 2540.33 పాయింట్లు తగ్గి.. 72824.03 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 817.5 పాయింట్లు తగ్గి.. 22806.95 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది.
ఇక డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 30 పైసలు తగ్గి 85.74కి చేరింది. అమిరకా అధ్యక్షుడు ట్రంప్ గత వారం ప్రకటించిన టారిఫ్ లతో , అంతర్జాతీయ వాణిజ్య యుద్ద భయాందోళనలు పెరిగి, మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది. ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది. 2008 తర్వాత ఆసియా మార్కెట్లు ఈ స్థాయిలో నష్టాలను చవి చూస్తున్నాయి.