
Elon Musk: ఎక్స్ ను అమ్మేసిన ఎలాన్ మస్క్..ఎవరికి విక్రయించాడో తెలుసా?
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ను విక్రయించినట్లు ప్రకటించారు. అయితే అది బయటి వ్యక్తులకు మాత్రం కాదట. మస్క్ నేత్రుత్వంలోని ఏఐ అంకుర సంస్థ ఎక్స్ ఏఐ కే విక్రయించారు. ఈ మేరకు మస్క్ ఎక్స్ వేదికగా తెలిపారు. 33 బిలియన్ డాలర్లకు ఎక్స్ ను అమ్మేసినట్లు మస్క్ ప్రకటించారు. తాజాగా ఎక్స్ ఏఐ విలువను 80 బిలయన్ డాలర్లుగా నిర్థారించారు. ఎక్స్ ఏఐ అధునాత ఏఐ సామార్థ్యాన్ని ఎక్స్ కు అనుసంధానించడం ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని మస్క్ తన పోస్టులో తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు మస్క్. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవోగానూ కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2022లో ట్విట్టర్ ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చేశారు. ఎక్స్ ను సొంతం చేసుకున్న తర్వాత సిబ్బందిని తొలగించడం, ద్వేషపూరిత ప్రసంగాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
చాట్ జీపీటీకి పోటీగా గత ఏడాది మస్క్ ఎక్స్ ఏఐ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించారు. ఎక్స్ ఏఐ, ఎక్స్ భవిష్యత్ లు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. డేటా మోడల్స్ ను అనుసంధానం చేయడం ద్వారా మరిన్ని ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ముందడుగు వేస్తున్నాం. ఎక్స్ ఏఐ అధునాతన సామర్థ్యం ఎక్స్ పరిధిని మరింత పెంచుతుందని మస్క్ తెలిపారు. ఈ రెండు సంస్థల కలయిక కోట్లాది మంది ప్రజలకు అద్బుత అనుభూతిని అందిస్తుందని మస్క్ తెలిపారు.