New Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న నియమాలు.. ఉద్యోగులు ముందుగానే ఇవి తెలుసుకోండి..!
New Rules For Employees: ఉద్యోగులకు సంబంధించిన అనేక కొత్త ఆదాయ నియమాలు ప్రారంభం అవ్వనుంది. ఏప్రిల్ 1వ తేదీ అతి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వారికి సంబంధించిన కొన్ని కొత్త ఆదాయ పన్నుల నియమాలు ఉన్నాయి. వాటిని ముందుగానే తప్పక తెలుసుకోవాలి.

New Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న నియమాలు.. ఉద్యోగులు ముందుగానే ఇవి తెలుసుకోండి..!
New Rules For Employees: 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు పలు కీలకమైన ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి 35 సవరణలు చేర్చింది. ఈ మార్పుల ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ నిబంధనలు అమల్లోకి రానుంది. ఉద్యోగులు ముందుగానే ఈ విషయాలను తెలుసుకోవాలి. ప్రధానంగా ట్యాక్స్ బెనిఫిట్స్ ,అమౌంట్ డిడక్షన్స్ వంటి అంశాలపై దీని ప్రభావం ఉంటుంది
ఉద్యోగులు వారికి సంబంధించిన కొత్త లేదా పాత పన్ను విధానాల్లో ఏది ఎంచుకోవాలో ముందుగానే గుర్తించుకోవాలి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలో ద్వారా వారు కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకోవాలా? పాత నిబంధన ఎంచుకోవాలా తెలుస్తుంది. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పెంచిన సంగతి తెలిసిందే. అంటే రూ. 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారికి పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదు.
ఇక కొత్త పన్ను విధానం సెక్షన్ 87 ఏ ప్రకారం 25వేల నుంచి రూ.60000 పెరుగుతుంది. అంటే రూ.12 లక్షల వరకు ఆదాయం ఉంటే ఇది పరిగణలోకి తీసుకోవచ్చు. రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా ఉద్యోగులు అదనంగా రూ.75 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. అంటే రూ.12,75,000 వరకు పన్ను రహితంగా పరిమితి ఉంది.
అంతేకాదు బ్యాంకు డిపాజిట్‌లో కూడా టీడీఎస్ లిమిట్ రూ.40,000 నుంచి రూ.50 వేల వరకు మారుతుంది. అంటే రూ.50,000 దాటే వరకు ఎలాంటి టీడీఎస్ వర్తించదు. ఇది కూడా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఇది కాకుండా ఎన్‌పీఎస్ వాత్సల్యా అకౌంట్లో డబ్బులు జమ చేసే వారికి కొన్ని అదనపు బెనిఫిట్స్ రానున్నాయి. అంటే ఇందులో రూ. 50,000 వరకు మీరు పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.