Gold Rate Today: బంగారానికి పట్టపగ్గాలేవు..భారీగా పెరుగుతున్న పసిడి ధర..నేడు ఎంత పెరిగిందంటే?

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశంలో బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం కాస్త తగ్గినట్లు అనిపించినా..నేడు మళ్లీ పుంజుకుంది. దీంతో ఇలా పెరుగుతూ పోతే బంగారం కొనేదేలా అంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80, 392 ఉంది. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 87,700కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,529 ఉండగా 24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 87,850ఉంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లోనూ 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,658 ఉంది. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 87,990కి చేరింది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు:
బెంగళూరు- రూ.80,593, రూ.87,920
పుణె- రూ.80,529, రూ.87,850
అహ్మదాబాద్- రూ.80,639, రూ.87,970
భువనేశ్వర్- రూ.80,548, రూ.87,870
భోపాల్- రూ.80,612, రూ.87,940'
ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర రూ. 97,470ఉంది. నేడు రూ. 99,120కి చేరుకుంది. ముంబై, విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లోనూ రూ. 97, 790 ఉండగా నేడు రూ. 99,440కి చేరుకుంది.