Pan Card: పాన్‌కార్డు పై ఉన్న మీ ఫోటో అప్‌డేట్ చేసుకోవాలా? ఆన్‌లైన్లో ఇలా సింపుల్‌గా మార్చండి..
Pan Card Photo Upate: మన దేశంలో ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిందే. ఇది ఆదాయపు పన్ను, ఏవైనా ఇతర ఆర్థిక లావాదేవీలకు ఒక గుర్తింపు కార్డులో ఉపయోగిస్తారు. అందుకే ఎప్పటికప్పుడూ పాన్ కార్డును కూడా అప్డేట్ చేసుకోవాలి

Pan Card: పాన్‌కార్డు పై ఉన్న మీ ఫోటో అప్‌డేట్ చేసుకోవాలా? ఆన్‌లైన్లో ఇలా సింపుల్‌గా మార్చండి..
Pan Card Photo Upate: పాన్ కార్డు పై ఫోటో మార్చుకోవడం చాలా సులభం. ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రెండు విధాలుగా ఫోటో మార్చుకోవచ్చు. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డుని కూడా ఆర్థిక లావాదేవీలు ఇతర పన్ను వ్యవహారాల్లో ఒక గుర్తింపు కార్డుగా మన దేశంలో ఉపయోగిస్తారు. అయితే చాలా రోజులుగా పాన్ కార్డు పై ఫోటో, సిగ్నేచర్ ఇతర వివరాలు మార్చుకోలేక పోతుంటారు. ఫోటోను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఫోటో ఆ పాన్ కార్డుపై స్పష్టంగా లేకపోతే కొత్త ఫోటోతో సింపుల్ టిప్స్ పాటించి మార్చుకోవచ్చు. ఆ స్టెప్ బై స్టెప్ విధానం ఇదే..
ఆన్లైన్లో పాన్ కార్డుపై ఉన్న ఫోటో మార్చుకోవడం ఎలా?
మీ పాన్‌కార్డుపై ఉన్న పాత ఫోటో చాలా సులభంగా మార్చుకోవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ లేదా ఆధార్ ఈ కేవైసీ ఉంటే సింపుల్ గా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫారమ్ మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
www.proteantinpan.com ముందుగా ఈ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇందులో మీరు 'సర్వీస్ సెక్షన్'ట్యాప్ పై క్లిక్ చేయాల్సి ఉంది. అక్కడ 'పాన్' ఎంపిక చేసుకోవాలి' .. చేంజ్ లేదా కరెక్షన్ ఫ్యాన్ డేటా పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ టైప్ వద్దా 'రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్' లేదా 'చేంజ్ కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్' అనే కేటగిరీని ఎంపిక చేయాలి. మీ వివరాలు నమోదు చేసి క్యాప్చని కూడా వెరిఫై చేసి, చివరిగా సబ్మిట్ కొట్టాలి
ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను కూడా ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అప్‌లోడ్ చేసి, చివరగా సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీకు ఫీజు చెల్లింపు పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫీజు చెల్లించిన తర్వాత మీకు 18 డిజిట్ల నెంబర్ (Acknowledgement Number)వస్తుంది. ఆ నెంబర్‌తో సింపుల్గా అప్లికేషన్ ట్రాక్ చేసుకోవచ్చు .
ఆఫ్ లైన్లో పాన్ కార్డుపై ఉన్న ఫోటో అప్డేట్ చేసుకునే విధానం..
మీ దగ్గరలో ఉన్న పాన్ సర్వీస్ సెంటర్ వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ తీసుకొని 'రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్' లేదా 'చేంజ్ కరెక్షన్ ఇన్ పాన్ డేటా' ఫారంను నింపండి. జాగ్రత్తగా నమోదు చేసిన తర్వాత దానికి సంబంధిత డాక్యుమెంట్స్ కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది. అడ్రస్ లేదా ఐడెంటిటీ ప్రూఫ్ తో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి .చివరగా 'సబ్మిట్' చేసి నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు వారు మీకు 15 అంకెల రిసీట్ ఇస్తారు. దాంతో సులభంగా మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేసుకోవచ్చు.