Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

Update: 2025-03-25 01:36 GMT
Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర
  • whatsapp icon

Gold Rate Today: బంగారం ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధర భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న రేటు మంగళవారం ఒక్కసారిగా తగ్గింది. నేడు మార్చి 25వ తేదీ మంగళవారం బంగారం ధరలు దిగి వచ్చాయి. సోమవారం ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,566 ఉండగా..నేడు రూ. 87,400కు పడిపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర సోమవారం రూ. 80,713 ఉండగా నేడు రూ. 80,254కు తగ్గింది. అలాగే 24క్యారెట్ల తులం బంగారం ధర నిన్న రూ. 88,050 ఉండగా నేడు రూ. 87,550కి పడిపోయింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర సోమవారం రూ. 80,841 ఉండగా నేడు రూ. 80, 383 కు దిగి వచ్చింది. 24క్యారెట్ల తులం బంగారం ధర నిన్న రూ. 88,190 ఉండగా నేడు రూ. 87, 690కి పడిపోయింది.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు

కోల్‌కతా- రూ.80,144, రూ.87,430

చెన్నై- రూ.80,483, రూ.87,800

బెంగళూరు- రూ.80,318, రూ.87,620

పుణె- రూ.80,254, రూ.87,550

వెండి ధరలను చూసినట్లయితే

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కిలో వెండి రూ. 97, 740 ఉంది. మంగళవారం రూ. 97, 470కి దిగింది. ముంబై లో నిన్న కిలో వెండి రూ. 97,910 ఉండగా..నేడు రూ. 97, 640 కు చేరుకుంది. ఇక హైదరాబాద్ , విజయవాడ, విశాఖలో కిలో వెండి సోమవారం రూ. 98, 060ఉండగా నేడు రూ. 97,790కి చేరింది.

Tags:    

Similar News