BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్.. ఏడాదిపాటు రీఛార్జీ లేకుండా ఎంజాయ్..
BSNL 1 Year Plan: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఈ ప్రభుత్వ రంగ దిగ్గజ కంపెనీ కొత్త రీఛార్జ్ ప్లాన్లతో ఆకట్టుకుంటుంది. ఏడాది పాటు సిమ్ యాక్టివ్‌గా ఉంచే ఒక అద్భుతమైన ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్.. ఏడాదిపాటు రీఛార్జీ లేకుండా ఎంజాయ్..
BSNL 1 Year Plan: ప్రభుత్వరంగ దిగ్గజ కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్లకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంది. రీఛార్జి ప్యాక్లతో అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాక్‌లను ముందుకు తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ఏడాది ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. దీంతో వాయిస్ కాలింగ్‌తొపాటు ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఆ పూర్తి వివరాలు ఇవే..
బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్లాన్..
ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే ఏడాది పాటు మళ్లీ రీఛార్జీ చేసుకునే అవసరం ఉండదు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 24 జీబీ డేటా పొందుతారు. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. 336 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. హోలీ ఆఫర్లో భాగంగా దీన్ని 29 రోజులపాటు అదనంగా పెంచారు. ఈ నేపథ్యంలో 365 రోజులు వ్యాలిడిటీ పొందుతారు.
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లో డేటా కాలింగ్‌తో పాటు ఎస్ఎంఎస్‌లు ఏడాది పాటు పొందుతారు. ఇది కాకుండా రూ.2399 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 395 రోజులు. అయితే, హోలీ ఆఫర్లో భాగంగా దీని వ్యాలిడిటీ రోజులను 425 కు పెంచారు. ఇందులో ప్రతిరోజు 2gb డేటా తో పాటు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు. ఈ రీఛార్జీ ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఫోన్ పే, జీపే ఇతర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా సులభంగా రీఛార్జీ చేసుకునే సౌలభ్యం కల్పించారు.
పెరిగిన టెలికాం ధరల తర్వాత భారత్ సంచార నిగం లిమిటెడ్ కస్టమర్లకు కొత్త ఆఫర్లతో రీఛార్జ్ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రైవేట్ కంపెనీలకు చెందిన యూజర్లు ఎక్కువ మొత్తంలో బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అవుతున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వాయిస్ కాలింగ్‌తో పాటు సిమ్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. డేటా కూడా పొందుతున్నారు. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను విస్తృతం చేస్తుంది. ఇప్పటికే 4జీ సేవలను లక్షకు చేరువలో ఏర్పాటు చేశారు.