Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర ..ఏకంగా రూ. 2000వేలు తగ్గింపు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధం అసలు కారణం అని చెప్పవచ్చు. అయినప్పటికీ బంగారం ధర ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ కంటే తక్కువ ధరకే చేరుకుంది. ఈ నేపథ్యంలో బంగారం ధర భవిష్యత్తులో పెరుగుతుందా లేదా తగ్గుతుందా. నేడు మార్చి 24వ తేదీ సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
నేడు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 89770 ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 82,290 ఉంది. అదే సమయంలో ఒక కిలో వెండి ధర రూ. 1,01,000 పలుకుతోంది. బంగారం ధరలు గడిచిన 10 రోజులుగా భారీగా హెచ్చుతగ్గులకు గురువుతున్నాయి. కాగా బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయి కంటే దాదాపు 2000 రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే బంగారం ధరలు తగ్గినట్లే అని చెప్పవచ్చు. బంగారం ధరలు గడిచిన నెల రోజులుగా దాదాపు ప్రతిరోజూ సరికొత్త రికార్డు దిశగా అడుగులు పెడుతున్నాయి. నిజానికి బంగారం ధర పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణంగా బంగారం ధర ప్రతిరోజూ పెరుగుతుంది.