PF: పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేయాలా? కేవలం 2 నిమిషాల్లో ఇలా డ్రా చేసుకోండి..

PF Withdraw In 2 Min: ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF) రిటైర్‌మెంట్‌ బెనిఫిట్ స్కీమ్‌. ఎంప్లాయీ, ఎంప్లాయర్‌ బేసిక్‌ పే లోని కొంత భాగం జమా అవుతుంది. ఈ పీఎఫ్‌ ఖాతాను ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) నిర్వహిస్తుంది.

Update: 2025-03-25 13:40 GMT
PF

PF: పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేయాలా? కేవలం 2 నిమిషాల్లో ఇలా డ్రా చేసుకోండి..

  • whatsapp icon

PF Withdraw In 2 Min: ప్రతి ఉద్యోగి జీతంలోని కొంత భాగం పీఎఫ్‌ ఖాతాలో జమా అవుతుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఈ బెనిఫిట్స్ పొందుతారు. ప్రతి ఉద్యోగికి 12 అంకెల నంబర్‌ను ఉద్యోగి చేరిన ప్రారంభంలో పీఎఫ్‌ ఖాతా ఓపెన్‌ చేసి జారీ చేస్తారు. దాని పేరు యూనివర్సల్ అకౌంట్‌ నంబర్‌ (UAN) అని పిలుస్తారు. దీని ద్వారానే ఉద్యోగి తన అవసరాల నిమిత్తం పీఎఫ్‌ డబ్బులను విత్‌ డ్రా చేసుకోవచ్చు.

పీఎఫ్‌ ద్వారా ఉద్యోగి రిటైర్మెంట్‌, రాజీనామా లేదా మరణం, ఇల్లు నిర్మాణం, చదువు, పెళ్లి, ఇతర మెడికల్‌ అవసరాల నిమిత్తం ఈ యూఏఎన్‌ నంబర్‌ ఉపయోగించి విత్‌ డ్రా చేసుకోవచ్చు.

మీ పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే విధానం..

ముందుగా ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌ లేదా ఉమాంగ్‌ యాప్‌ ఓపెన్‌ చేయండి.

ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి.

ఆ తర్వాత మీరు యూఏఎన్‌, పాస్వర్డ్‌, క్యాప్చా కోడ్‌ కూడా నమోదు చేయాలి.

అప్పుడు హోంపేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మీరు 'ఆన్‌లైన్‌ సర్వీసు' పై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత క్లెయిమ్‌ ఆప్షన్‌ ఎంచుకుని మీ బ్యాంకు ఖాతా నంబర్‌ వెరిఫై చేసుకోవాలి.

చివరగా 'ప్రొసీడ్‌ ఆన్‌లైన్‌ క్లెయిమ్‌'పై క్లిక్‌ చేయాలి.

అక్కడ మీరు పీఎఫ్‌ అడ్వాన్స్‌ ఫారమ్‌ 19 ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీరు పీఎఫ్‌ విత్‌ డ్రా చేసుకోవడానికి జాబితాలో ఉన్న కారణాలను సెలక్ట్‌ చేసుకోవాలి. మీకు కావాల్సిన డబ్బును కూడా ఎంటర్ చేయాలి.

చివరగా మీ బ్యాంకు పాస్‌బుక్‌ లేదా చెక అప్లోడ్‌ చేయాలి. చివరగా ఆధార్‌ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్‌ చేయాలి. మీ క్లెయిమ్‌ డబ్బులు వారం నుంచి 10 రోజుల్లో క్రెడిట అవుతాయి.

ప్రతి ఉద్యోగి తన ఆధార్‌ కార్డును ఉపయోగించి ఇలా పీఎఫ్ లేదా ఈపీఎస్‌ డబ్బులను సింపుల్‌గా అతి తక్కువ సమయంలోనే విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఆధార్‌తో చాలా తక్కువ సమయంలోనే డబ్బులు మీ ఖాతాలో జమా అవుతాయి.

Tags:    

Similar News