Fixed Deposit: అధిక రాబడి కోసం ఎస్బీఐ ఎఫ్డీ స్కీమ్ - మార్చి 31 చివరి తేదీ
Fixed Deposit: స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే కాస్త తక్కువైనా మంచి రాబడిని అందించే పథకాల కోసం చూస్తున్నారు.

Fixed Deposit: అధిక రాబడి కోసం ఎస్బీఐ ఎఫ్డీ స్కీమ్ - మార్చి 31 చివరి తేదీ
Fixed Deposit: స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే కాస్త తక్కువైనా మంచి రాబడిని అందించే పథకాల కోసం చూస్తున్నారు. ఎందుకంటే వారు పెట్టిన పెట్టుబడులు నష్టపోకుండా ఉండాలి. ఈ క్రమంలోనే అలాంటి వారికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ డ్ డిపాజిల్ స్కీంల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అవి మంచి రాబడిని అందిస్తాయి. అలాగే, ఈ ఎఫ్ డీ పథకాలు 450 రోజుల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అవుతాయి. కాబట్టి, మీరు మీ పెట్టుబడిపై రాబడి కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ఎఫ్డీ పథకాలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. అయితే ఉదాహరణకు, మీరు SBI అమృత్ వృష్టి, SBI అమృత్ కలష్ వంటి FD పథకాలపై మంచి రాబడిని పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశ పెట్టిన ఈ పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం.. కానీ ఈ పథకాలలో మార్చి 31 వరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి.
SBI అమృత్ వృష్టి FD స్కీం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం 444 రోజుల్లో మెచ్యూర్ అవుతుంది. ఈ FD పథకంలో మీరు సంవత్సరానికి 7.25శాతం వడ్డీ రేటును పొందుతారు. ఒక సీనియర్ సిటిజన్ SBI ఈ పథకంలో డబ్బు డిపాజిట్ చేస్తే వారు 7.75శాతం వడ్డీ రేటును పొందుతారు.
SBI అమృత్ కలష్ FD స్కీం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలష్ ఒక ప్రత్యేక FD పథకం, ఇది 400 రోజుల్లో మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో SBI 7.10శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఇందులో పెట్టుబడి పెడితే వారు ఈ పథకంలో 7.60శాతం వడ్డీని పొందుతారు.
SBI వీకేర్ FD పథకం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీకేర్ FD పథకం సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో సీనియర్ సిటిజన్లు 7.50శాతం వడ్డీ రేటును పొందుతారు. అయితే మీరు ఈ పథకంలో 5 నుండి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలి. సీనియర్ సిటిజన్ పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పొచ్చు.