Employees: ఉద్యోగులకి బ్యాడ్‌న్యూస్‌.. టేక్ హోమ్‌ సాలరీ తగ్గే అవకాశాలు..!

Employees: ప్రీమియంలో 10-15 శాతం పెరిగినట్లయితే కంపెనీలు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది...

Update: 2022-04-23 06:47 GMT

Employees: ఉద్యోగులకి బ్యాడ్‌న్యూస్‌.. టేక్ హోమ్‌ సాలరీ తగ్గే అవకాశాలు..!

Employees: మీరు యజమాని గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే త్వరలో మీ టేక్ హోమ్ సాలరీ తగ్గవచ్చు. చాలా కంపెనీలు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియంను 10-15 శాతం పెంచేందుకు సన్నాహాలు చేశాయి. పెరిగిన ఈ ప్రీమియం ఉద్యోగుల జీతంపై ప్రభావం చూపుతుంది. ప్రీమియంలో 10-15 శాతం పెరిగినట్లయితే కంపెనీలు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం మీ జీతం నుంచి కట్‌ చేస్తారు. దీంతో టేక్ హోమ్ జీతం తగ్గుతుంది.

కోవిడ్‌కు సంబంధించిన క్లెయిమ్‌లు, ద్రవ్యోల్బణం నిరంతర పెరుగుదల కారణంగా గ్రూప్ మెడిక్లెయిమ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో కంపెనీల నష్టాల నిష్పత్తి గణనీయంగా పెరిగింది. గ్రూప్ ఇన్సూరెన్స్‌లో కంపెనీల నష్టాల నిష్పత్తి నిరంతరం పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా వల్ల పెరిగిన క్లెయిమ్‌ల కారణంగా ప్రీమియం పెంచాలని కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక కాంట్రాక్ట్ కింద చాలా వ్యక్తులను కవర్ చేస్తుంది. ఉద్యోగుల జీవిత భాగస్వాములు, పిల్లలకు కవరేజీని తీసుకునే అవకాశం ఉంటుంది.

ఉద్యోగి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తే అతని టేక్ హోమ్ శాలరీపై ప్రభావం పడుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత పాలసీ కంటే దాని ప్రీమియం చౌకగా ఉంటుంది. ఈ బీమాను కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఈ పాలసీకి ప్రీమియం చెల్లించడం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ జీతం నుంచి తీసుకుంటుంటారు. యజమానులే పాలసీ ప్రీమియం కడుతుంటారు. దీంతో ఈ పాలసీలు ల్యాప్ అయ్యే అవకాశాలు ఉండవు.

Tags:    

Similar News